- Telugu News Photo Gallery Cricket photos IND vs WI 2nd Test: Virat Kohli Surpasses African Legend Jacques Kallis to become leading run getter in international cricket
IND vs WI: అసలైన లిస్టులోకి ‘కింగ్’ ఎంట్రీ.. 500వ మ్యాచ్‌లో చెలరేగిన కోహ్లీ.. దెబ్బకు ఆఫ్రికన్ లెజెండ్ స్థానం గల్లంతు..
IND vs WI 2nd Test: వెస్టిండీస్, భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కెరీర్‌లో 500వ అంతర్జాతీయ మ్యాచ్. భారత్ తొలి బ్యాటింగ్ చేస్తున్న ఈ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 288 పరుగులు చేసింది. అయితే తొలి రోజు ఆట ముగిసేసరికి 87 పరుగులతో క్రీజులోనే ఉన్న విరాట్ కోహ్లీ అసలైన లిస్టులో స్థానం పొందాడు. ఆ వివరాలేమిటో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jul 21, 2023 | 8:39 AM

IND vs WI 2nd Test: 500వ అంతర్జాతీయ మ్యాచ్‌లో కనిపిస్తున్న విరాట్ కోహ్లీ చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. తాజా టెస్టు మ్యాచ్‌లో 87 పరుగులు చేసి క్రీజులోనే ఉన్న కింగ్ కోహ్లీ జాక్వెస్ కల్లీస్‌ని అధిగమించి అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా అవతరించాడు.


ఇక కింగ్ కోహ్లీ తాను ఆడుతున్న 500వ మ్యాచ్‌లోనే కల్లీస్‌ని అధిగమించి మొత్తంగా 25,548 రన్స్ చేశాడు. తద్వారా అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన 5వ ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు.

అయితే అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్లుగా సచిన్ టెండూల్కర్(34,357) అగ్రస్థానంలో ఉన్నాడు. సచిన్ తర్వాత కుమార సంగక్కర(28,016).. రికీ పాంటింగ్(27,483).. మహేలా జయవర్ధనే(25,957).. వరుస స్థానాల్లో ఉన్నారు. తాజాగా విరాట్ కోహ్లీ((25,548*) అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన 5వ ప్లేయర్లుగా ఎదిగాడు.

కాగా, ఇప్పటికే 500 మ్యాచ్‌ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కింగ్ కోహ్లీ(25,548*).. రికీ పాంటింగ్(25,035), సచిన్ టెండూల్కర్(24,874), జాక్వెస్ కల్లీస్(24,799) వంటి దిగ్గజాలను అధిగమించి అగ్రస్థానంలో నిలిచాడు.





























