Andhra Pradesh: పబ్లిక్ టాయ్‌లెట్‌ నుంచి గట్టిగా శబ్ధాలు.. డోర్ ఓపెన్ చేసి చూడగా షాకింగ్ సీన్.. వెంటనే..

నానాటికి మనుషులు మరింత రాక్షసంగా మారుతున్నారు. అసలు కనీస మానవత్వమే కరువైపోతోంది. ఎంతటి క్రూరత్వం అంటే.. పసిగుడ్డును టాయిలెట్‌లో వదిలేసి వెళ్లేంత. తాజాగా ఇలాంటి అమానవీయ ఘటనే పల్నాడు జిల్లా వినుకొండలో వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన బిడ్డను మరుగుదొడ్డిలో వదిలి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు.

Andhra Pradesh: పబ్లిక్ టాయ్‌లెట్‌ నుంచి గట్టిగా శబ్ధాలు.. డోర్ ఓపెన్ చేసి చూడగా షాకింగ్ సీన్.. వెంటనే..
Just Born Baby
Follow us
T Nagaraju

| Edited By: Shiva Prajapati

Updated on: Jul 23, 2023 | 7:51 AM

నానాటికి మనుషులు మరింత రాక్షసంగా మారుతున్నారు. అసలు కనీస మానవత్వమే కరువైపోతోంది. ఎంతటి క్రూరత్వం అంటే.. పసిగుడ్డును టాయిలెట్‌లో వదిలేసి వెళ్లేంత. తాజాగా ఇలాంటి అమానవీయ ఘటనే పల్నాడు జిల్లా వినుకొండలో వెలుగు చూసింది. అప్పుడే పుట్టిన బిడ్డను మరుగుదొడ్డిలో వదిలి వెళ్లారు గుర్తు తెలియని వ్యక్తులు. ఈ దారుణానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

పల్నాడు జిల్లా వినుకొండ ఆర్టీసీ బస్టాండ్.. రాత్రి ఎనిమిది గంటల సమయం. ఆర్టీసీలో వాటర్ సర్వీస్ మెన్ రవి తేజ ఎప్పటిలాగే టాయిలెట్‌కు వెళ్ళాడు. అయితే అక్కడ అప్పుడే పుట్టిన బిడ్డ ఉండటాన్ని చూసి షాక్ అయ్యాడు. వెంటనే.. చుట్టుపక్కల అంతా గమనించాడు. ఎవరూ కనిపించలేదు. కావాలనే శిశువును అక్కడ వదిలి వెళ్ళారని గుర్తించిన రవి.. తనకు పరిచయం ఉన్న వారికి సమాచారం అందించాడు. వారు వచ్చి చూడగా.. ఆడ శిశువు ప్రాణాలతోనే ఉందని గుర్తించారు. వెంటనే వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు శిశువుకు వైద్యం అందించారు. శిశువు ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు డాక్టర్స్.

ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు తెలియజేశారు. ఆడ శిశువు కారణంగానే వదిలి వెళ్లారా? లేక ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న సిసి కెమెరా విజువల్స్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, అప్పుడే పుట్టిన ఆడ బిడ్డను మరుగుదొడ్డిలో వదిలి వెళ్లడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంత అమానుషంగా ఎలా ప్రవర్తిస్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
గ్రాండ్‌గా పీవీ సింధు రిసెప్షన్.. హాజరైన గవర్నర్, సీఎం రేవంత్
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
కోర్టు హాల్‌లో ప్రత్యక్షమైన పాము.. గంట పాటు ఆగిన కార్యకలాపాలు
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ