Rain Alert: తెలుగు రాష్ట్రాలకు డబుల్‌ వార్నింగ్‌.. మరో ఐదు రోజులపాటు కుండపోత వర్షాలు..!

Heavy rainfall alert: తెలుగు రాష్ట్రాలకు మరో వార్నింగ్‌ ఇచ్చింది ఐఎండీ. ఇప్పుడున్న అల్పపీడనానికి తోడు రేపు ఇంకో ద్రోణి ఏర్పడుతుందని బాంబు పేల్చింది. డబుల్‌ అల్పపీడన ద్రోణులతో ఇంకో 5రోజులపాటు కుండపోత వర్షాలు తప్పవని హెచ్చరించింది.

Rain Alert: తెలుగు రాష్ట్రాలకు డబుల్‌ వార్నింగ్‌.. మరో ఐదు రోజులపాటు కుండపోత వర్షాలు..!
Rain Alert
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Jul 23, 2023 | 7:27 AM

Heavy rainfall alert: తెలుగు రాష్ట్రాలకు మరో వార్నింగ్‌ ఇచ్చింది ఐఎండీ. ఇప్పుడున్న అల్పపీడనానికి తోడు రేపు ఇంకో ద్రోణి ఏర్పడుతుందని బాంబు పేల్చింది. డబుల్‌ అల్పపీడన ద్రోణులతో ఇంకో 5రోజులపాటు కుండపోత వర్షాలు తప్పవని హెచ్చరించింది. తెలంగాణతోపాటు కోస్తాంధ్ర, రాయలసీమల్లో భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్‌ బెల్‌ మోగించింది. అల్పపీడనం కారణంగా బంగాళాఖాతం అల్లకల్లోలంగా ఉందని, సముద్రంలో వాతావరణం అస్సలు అనుకూలంగా లేదంటోంది వాతావరణశాఖ. తీరం వెంబటి గంటకు 50 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ఎట్టిపరిస్థితుల్లో మరో నాలుగు రోజులు సముద్రంలో వేటకెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది.

ప్రస్తుతానికైతే, తెలంగాణలో వర్షాలు కొంచెం తగ్గుముఖం పట్టాయ్‌!. రెడ్‌ అలర్ట్‌, ఆరెంజ్‌ అలర్ట్‌ నుంచి ఎల్లో అలర్ట్‌కు తీవ్రత తగ్గింది. తెలంగాణలో 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ప్రకటించింది వాతావరణశాఖ. ఆదిలాబాద్‌, కొమురంభీమ్‌, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల, సిరిసిల్ల, ములుగు, కొత్తగూడెం, సిద్దిపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్‌, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంటోంది ఐఎండీ. ఇక, రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో మోస్తరు నుంచి భారీ వర్షం కురవొచ్చని చెప్పింది.

మరో 5రోజులు కుంభవృష్టి తప్పదని ఐఎండీ హెచ్చరిస్తున్నా, తెలుగు రాష్ట్రాల్లో మాత్రం వర్షాల జోరు కొంచెం తగ్గింది. అయితే, అది తాత్కాలికమే అంటోంది వాతావరణశాఖ. ఏపీ, తెలంగాణకు ఇప్పటికీ ముప్పు పొంచే ఉందని హెచ్చరిస్తోంది. ఎనీ టైమ్‌, మళ్లీ వరుణుడు విరుచుకుపడటం ఖాయమని వార్నింగ్‌ ఇస్తోంది. వరుణుడు బ్రేక్‌ ఇచ్చాడు కదా అని రిలాక్స్‌ అయిపోద్దని, మరో 5రోజులపాటు అలర్ట్‌గా ఉండాల్సిందే అంటోంది ఐఎండీ.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..