వాళ్ళ కాళ్ళ స్పర్శ కోసం వందల మంది ఎదురు చూపు.. కాలితో తొక్కించుకుంటే సర్వరోగాలు మాయం..
Sri Sathya Sai district: భూతప్పల కాలి స్పర్శ కోసం ఆడ, మగ, చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా సుదూరప్రాంతాల నుండి వచ్చి వారి కాలి స్పర్శ కోసం జనం ఎగబడతారు... ఇంతకీ భూతప్పలు అంటే ఎవరు???? వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని..
శ్రీసత్యసాయి జిల్లా న్యూస్, జూలై 22: భూతప్పల కాలి స్పర్శ కోసం ఆడ, మగ, చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా సుదూరప్రాంతాల నుండి వచ్చి వారి కాలి స్పర్శ కోసం జనం ఎగబడతారు… ఇంతకీ భూతప్పలు అంటే ఎవరు.. ? వారి కాలి స్పర్శ తగిలితే దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని, సంతానం కలుగుతుందని అక్కడి భక్తులకు ఎందుకంత విశ్వాసం.. ? శ్రీ సత్యసాయిజిల్లా మడకశిర మండలంలోని భక్తరపల్లి శ్రీ లక్ష్మి నరసింహస్వామి వారి దేవాలయం వద్ద తొలి ఏకాదశి ముగిసిన తర్వాత స్వామి వారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. అనంతరం ప్రతియేటా భూతప్పల ఉత్సవం జరుగుతుంది. ఈ భూతప్పల తంతు ఎంతో ప్రాదన్యతను సంతరించుకొంది.
గొల్ల సామాజిక వర్గానికి చెందిన వారి ఒంటి మీదకు లక్ష్మీనరసింహస్వామి ఆవహిస్తాడని ఇక్కడి భక్తుల విశ్వాసం… అలా స్వామి ఆవహించిన వారిని భూతప్పలు అని పిలుస్తారు….150 సంవత్సరాల సాంప్రదాయం….ఆనవాయితీగా వస్తున్న భూతప్పల ఉత్సవంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. స్వామివార్ల ఉత్సవ విగ్రహాలను ప్రత్యేకంగ అలంకరించి… పూజలు చేసి ఊరేగింపు చేస్తారు. ఆ దారి వెంట భూతప్పలుగా పిలువబడే వ్యక్తులు ఆహాకారాలు చేస్తూ స్వామివారి ఉత్సవ విగ్రహాలు ఊరేగింపు చేసే దారిలో విన్యాసాలు చేస్తూ, గుడి ప్రాంగణంలో బోర్ల పడుకున్న భక్తులపై నడుచుకుంటూ వెళ్తారు.
అలా వారి కాలి స్పర్శ తగిలిన భక్తులకు సంతానం కలుగుతుందని, దీర్ఘకాలిక రోగాలు నయమవుతాయని, ఇంటిలో సుఖశాంతులు నెలకుంటాయని వారి ప్రగాడమైన విశ్వాసం. ఇలా అనవాయితీగా ప్రతియేటా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఆడా, మగా తేడా లేకుండా దేవుడిపై నమక్కంతో ఎంతో మంది భక్తులు పాల్గొంటారు… ఇది ఇక్కడి అనాదిగ వస్తున్న ఆచారం. ఈకార్యక్రమాన్ని తిలకించడానికి ఆంద్ర,కర్ణాటక ప్రాంతాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..