Andhra Pradesh: అసలు వాలంటీర్లకు బాస్ ఎవరూ ?.. మరోసారి ప్రశ్నలు సంధించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్
ఏపీలో గ్రామ వాలంటీర్ల సేవలు గత కొన్ని రోజులుగా వివాదస్పందంగా మారాయి. ప్రజల వ్యక్తిగత డేటాను తీసుకుని వారి భద్రతకు భంగం కలిగిస్తున్నారంటూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు నేతలు విమర్శిస్తున్నారు.
ఏపీలో గ్రామ వాలంటీర్ల సేవలు గత కొన్ని రోజులుగా వివాదస్పందంగా మారాయి. ప్రజల వ్యక్తిగత డేటాను తీసుకుని వారి భద్రతకు భంగం కలిగిస్తున్నారంటూ జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు సహా పలువురు నేతలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సీఎం జగన్ ఈ వివాదంపై విపక్ష నేతలకు కౌంటర్ కూడా వేశారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి వాలంటీర్లపై సందేహం వ్యక్తం చేశారు. వాలంటీర్లకు అసలు బాస్ ఎవరని.. ప్రజల నుంచి వ్యక్తిగత డేటా సేకరించాలని వీరికి ఎవరు ఆదేశాలిచ్చారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు. ఈ ఆదేశాలు ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇచ్చాందా లేదా ముఖ్యమంత్రా? ప్రభుత్వ ప్రధాన కార్యదర్శా? కలెక్టరా? ఎమ్మెల్యేనా? ఎవరూ అంటూ అడిగారు.
ప్రజల నుంచి డేటా సేకరించే విషయంలో వైసీపీ సర్కార్ నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి అని డిమాండ్ చేశారు. అలాగే ఈ ట్వీట్‌కు ప్రధానమంత్రి కార్యాలయాన్ని, కేంద్ర హోంమంత్రి కార్యాలయాన్ని సైతం ట్యాగ్ చేశారు. మరో ట్వీట్‌లో కూడా నెల్లూరు ఎస్పీ అయిన తిరుమలేశ్వర్ రెడ్డి ఇటీవల చెప్పిన అంశాలను కూడా జత చేశారు. అందలో ఆ ఎస్పీ.. లీకైన ఒక వేలిమద్ర ఆధారంగా నకిలీ వేలిముద్ర తయారు చేస్తున్నారని.. ఆ తర్వాత ఆధార్ నంబర్ ద్వారా ఒక ఖాతా నుంచి మరో ఖాతాలోకి రూ.51.25 లక్షలు బదిలీ చేసుకున్నారని తెలిపారు. అయితే పవన్ చేసిన ఈ ట్వీట్లకు ఏపీ ప్రజలు తమ అభిప్రాయలు పంచుకుంటున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..