Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra Pradesh: సాగర తీరాన మరో అద్భుత నిర్మాణం… విశాఖలో ఓషన్‌ డెక్‌ నిర్మాణానికి ఏర్పాట్లు.

సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ బీచ్ అందాలను మరింత విస్తారంగా, కనులారా తిలకించేందుకు రెండు అంతస్తుల ఓషన్ డెక్‌ సిద్దం అవుతోంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ డెక్ ను పాత లైట్‌హౌస్ సమీపంలోని MGM పార్కు వద్ద ఏర్పాటు చేస్తోంది. ఈ విషయాన్ని వీ ఎం అర్ డీ ఏ జాయింట్ కమిషనర్ వి.రవీంద్ర స్వయంగా తెలిపారు...

Andhra Pradesh: సాగర తీరాన మరో అద్భుత నిర్మాణం... విశాఖలో ఓషన్‌ డెక్‌ నిర్మాణానికి ఏర్పాట్లు.
Visakhapatnam
Follow us
Eswar Chennupalli

| Edited By: Narender Vaitla

Updated on: Jul 21, 2023 | 9:09 PM

సిటీ ఆఫ్ డెస్టినీ విశాఖ బీచ్ అందాలను మరింత విస్తారంగా, కనులారా తిలకించేందుకు రెండు అంతస్తుల ఓషన్ డెక్‌ సిద్దం అవుతోంది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ డెక్ ను పాత లైట్‌హౌస్ సమీపంలోని MGM పార్కు వద్ద ఏర్పాటు చేస్తోంది. ఈ విషయాన్ని వీ ఎం అర్ డీ ఏ జాయింట్ కమిషనర్ వి.రవీంద్ర స్వయంగా తెలిపారు. సముద్రం మీదుగా 50 మీటర్లు, భూమిపై 50 మీటర్లతో 100 మీటర్ల విస్తీర్ణంలో జీ+1 ఓషన్ డెక్‌ను నిర్మించేందుకు ఈ ప్రతిపాదన సిద్ధం అయింది. ఈ రెండు అంతస్తుల ఓషన్ డెక్‌ప్రాజెక్టు అంచనా వ్యయం 7.8 కోట్లు. ప్రాజెక్ట్ కోసం కోస్టల్ రెగ్యులేషన్ జోన్ – సిఆర్‌జెడ్ కింద క్లియరెన్స్ కూడా వచ్చేసింది. ఈ ప్లాన్ ప్రకారం, డెక్‌లోని గ్రౌండ్ ఫ్లోర్‌లో రెస్టారెంట్ మరియు మొదటి అంతస్తులో వ్యూపాయింట్ ఉండబోతోంది. ఈ కీలక ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనకు వి ఎం అర్ డీ ఏ బోర్డు సమావేశంలో ఆమోదం లభించింది. ఇతర అనుమతులు పొందిన తర్వాత, ఈ నెలలో టెండర్లు ఆహ్వానించబడతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఓషన్ డెక్ నిర్మాణం పూర్తవుతుంది” అని కమిషనర్ రవీంద్ర టీవీ9 కి తెలిపారు.

11 అంతస్థుల మల్టీ లెవెల్ కార్ పార్కింగ్..

సిరిపురంలోని వీఎంఆర్‌డీఏ కార్యాలయం ఎదురుగా ఉన్న 1.35 ఎకరాల్లో 80 కోట్లతో చేపట్టిన 11 అంతస్తుల మల్టీ లెవల్‌ కార్‌ పార్కింగ్‌ ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తవుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి పూర్తయి ఈ సౌకర్యం నగర పౌరులకు అందుబాటులోకి రానుంది. 1.90 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు అంతస్తులలో 430 కార్లు, 400 ద్విచక్ర వాహనాలకు కేటాయించనుండగా, మిగిలిన ఆరు అంతస్తుల్లో 1.64 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో దుకాణాలు, కార్యాలయాలు, ఇతర వాణిజ్య సంస్థలు రానున్నాయి. 88 కోట్లతో నిర్మించనున్న ఈ ప్రతిపాదిత నేచురల్ హిస్టరీ పార్క్, మ్యూజియం రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌ను ప్రస్తావిస్తూ, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆమోదం కోసం ప్రభుత్వానికి పంపినట్లు వి ఎం అర్ డీ ఏ తెలిపింది.

విశాఖలో రెండు కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం..

ప్రతిపాదిత రాజధాని విశాఖ లో మౌలిక సదుపాయాల కల్పన పై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇతర ప్రాజెక్టులతోపాటు పెందుర్తి, యెండాడలో రెండు కన్వెన్షన్‌ సెంటర్ల నిర్మాణాన్ని కూడా వీఎంఆర్‌డీఏ చేపట్టింది. పెందుర్తిలో G+1 నిర్మాణం కోసం వీ ఎం అర్ డీ ఏ 39 కోట్ల రూపాయలు అందించగా, పార్లమెంటు సభ్యుల స్థానిక ప్రాంత అభివృద్ధి పథకం నిధుల నుండి 2 కోట్ల రూపాయలు కేటాయించారు. యెండాడలో 6.87 కోట్ల రూపాయలతో మరొక కన్వెన్షన్ సెంటర్‌ నిర్మాణం జరుగుతోంది.. వీఎంఆర్‌డీఏకు 4.87 కోట్లు కేటాయించగా ఎంపీల్యాడ్స్‌ నిధుల నుంచి రూ.2 కోట్లు మంజూరయ్యాయి. ఎన్ ఎ డీ ఫ్లైఓవర్ వద్ద రోడ్ ఓవర్ బ్రిడ్జి- ఆర్‌ఓబీ పై, రైల్వే అధికారులు ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపిన తర్వాత పనులు ప్రారంభించనున్నట్లు రవీంద్ర చెప్పారు. 28 కోట్లతో నిర్మిస్తున్న ఆర్‌ఓబీ 2024 జనవరి నాటికి పూర్తయ్యే అవకాశం ఉంది. విశాఖకు సెప్టెంబర్‌లో సీఎం వస్తున్నారని ప్రభుత్వ పెద్దలు పదేపదే ప్రకటిస్తున్న నేపథ్యంలో విశాఖలో విఎంఅర్డీఏ ఈ పనులను అత్యవసరంగా చేపట్టడం పై ఆసక్తికర చర్చలు ప్రారంభం అయ్యాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..