ఆ నేత గొంతులో పచ్చి వెలక్కాయ.. ఒకటి అనుకుంటే ఇంకోటైంది.. ఏమా కథ?

రాష్ట్రంలో అమలయ్యే కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రశ్నలు అడిగితే.. వచ్చే సమాధానాలు ఒక్కోసారి విమర్శనాస్త్రాలను అందిస్తే.. ఒక్కోసారి తమనే ఇరకాటంలో పడేసేలా ఉండేవి. సాధారణంగా తాము అడిగిన ప్రశ్నలు కేంద్రం ఇచ్చే సమాధానాలను ఎంపీలు స్వయంగా నేరుగా మీడియా దృష్టికి తీసుకొస్తూ ఉంటారు.

ఆ నేత గొంతులో పచ్చి వెలక్కాయ.. ఒకటి అనుకుంటే ఇంకోటైంది.. ఏమా కథ?
Kanakamedala Ravindra Kumar
Follow us

| Edited By: Jyothi Gadda

Updated on: Jul 21, 2023 | 10:42 PM

రాజకీయాల్లో ఎవరైనా ప్రత్యర్థులను ఇరకాటంలో పడేయాలని చూస్తుంటారు. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీ తప్పిదాలు, ఒకవేళ ఆ పార్టీ అధికారంలో ఉంటే ప్రభుత్వ వైఫల్యాలను వెతికిపట్టుకుని మరీ విమర్శించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఏ పార్టీ అయినా ఇదే పని చేస్తుంది. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు. అయితే ఒక్కోసారి ప్రత్యర్థుల తప్పులు, వైఫల్యాలను వెతకాలన్న ప్రయత్నం బెడిసికొడుతూ ఉంటుంది. తాము ఊహించింది ఒకటైతే, అక్కడ జరిగేది మరొకటి ఉంటుంది. ఇప్పుడు అలాంటి పరిస్థితే తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్‌కు ఎదురైంది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ (TDP).. అధికారపక్షం వైఎస్సార్ కాంగ్రెస్‌(YSRCP)పై రోజూ ఏదో ఒక రకంగా విమర్శలు చేస్తూనే ఉంటుంది. మాటలు తూటాల్లా పేలుతుంటాయి. తాము అధికారం ఉన్నంత వరకు ఏపీలో పారిశ్రామిక వృద్ధి బాగా జరిగిందని, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు బాగా వచ్చేవని, కానీ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రం తిరోగమనంలో ఉందని విమర్శిస్తూ ఉంటారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫ్యాక్షనిస్టులా వ్యవహరిస్తున్నారని, ఫలితంగా కొత్త పరిశ్రమల మాట పక్కన పెడితే ఉన్న పరిశ్రమలే రాష్ట్రం నుంచి పొరుగు రాష్ట్రాలకు తరలిపోతున్నాయని కూడా విమర్శిస్తుంటారు. ఇందులో వాస్తవం ఎంత అన్నది పక్కనపెడితే.. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విషయంలో తెలుగుదేశం నేతలు అనుకున్నది ఒకటైతే, కేంద్రం ఇచ్చిన సమాధానం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. శుక్రవారం రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రం ఇచ్చిన సమాధానంతో ఈ విషయం స్పష్టమైంది.

ఇంతకీ అసలు విషయం ఏంటంటే..?

ఆంధ్రప్రదేశ్‌లో 2019 నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గాయన్న అభిప్రాయంలో ఉన్న తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్.. ఆ విషయాన్ని తెలుసుకోవడం కోసం శుక్రవారం రాజ్యసభలో ప్రశ్నలు అడిగారు. ఎంపీలు అడిగే ప్రశ్నల్లో కొన్నింటిని లాటరీ ద్వారా తీసి స్టార్డ్ (* STARRED) ప్రశ్నలుగా ఎంపిక చేస్తారు. వాటిని సభలో ప్రశ్నోత్తరాల సమయంలో సదరు ఎంపీ నేరుగా అడిగేందుకు ఆస్కారం కల్పించి, సమాధానాన్ని కూడా సభలోనే మంత్రి నేరుగా చెబుతుంటారు. లాటరీలో ఎంపికకాని ప్రశ్నలను అన్‌స్టార్డ్ (UNSTARRED) ప్రశ్నలుగా వర్గీకరించి, వాటికి లిఖితపూర్వక సమాధానాలను సంబంధిత మంత్రిత్వ శాఖ అందజేస్తూ ఉంటుంది. శుక్రవారం కనకమేడల అడిగిన ప్రశ్న ఇలా ఉంది. “2019 మే నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వివరాలు ఇవ్వండి. అలాగే 2019 మే నుంచి ఏపీలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దారుణంగా పడిపోయాయని, ఆ కారణంగా రాష్ట్రంలో ఉపాధి కల్పన, ఉద్యోగ అవకాశాలు తగ్గాయని ప్రభుత్వానికి తెలుసా?” అని అడిగారు. ప్రశ్న ద్వారానే ఆయన ఉద్దేశం ఏంటో స్పష్టంగా అర్థమవుతోంది. అయితే కేంద్రం నుంచి ఊహించని రీతిలో సమాధానం ఎదురైంది. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కడా తగ్గలేదని, ఇంకా చెప్పాలంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ‘ఆల్ టైమ్ రికార్డ్’ స్థాయిలో పెరిగాయని కేంద్రం నుంచి సమాధానం ఎదురైంది. కనకమేడల ప్రశ్నకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాశ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో ప్రతియేటా ఏపీకి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల మొత్తం ఎంత అన్నది ఒక పట్టికలో పొందుపరిచారు. 2019 (అక్టోబర్) – 2020 (మార్చి) మధ్యకాలంలో ఏపీకి 200.97 మిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయని, ఆ తర్వాత ఏడాది కోవిడ్-19 పరిస్థితుల కారణంగా తగ్గి 85.85 మిలియన్ డాలర్లకే పరిమితమయ్యాయని కేంద్ర మంత్రి తెలిపారు. ఆ తర్వాత ఏడాది అంటే.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో 224.96 మిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు నమోదయ్యాయి. 2022-23లో నమోదైన 284.22 మిలియన్ డాలర్ల పెట్టుబడులు ‘ఆల్ టైమ్ హై’ అంటూ వెల్లడించారు.

ఇక విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు దేశంలోకైనా లేదా దేశంలోని ఏ రాష్ట్రంలోకైనా వచ్చేందుకు దోహదపడే కారణాల గురించి కూడా సమాధానంలో వివరించారు. దేశం లేదా రాష్ట్రంలోని సహజ వనరులు, మార్కెట్ సైజ్, మౌలిక వసతులు, రాజకీయంగా పెట్టుబడులకు అనుకూల వాతావరణం, సూక్ష్మ ఆర్థిక స్థిరత్వం, పెట్టుబడుల విషయంలో విదేశీ పారిశ్రామికవేత్తల ధోరణి వంటి అంశాల ఆధారంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతుందని వెల్లడించారు.

ఇవి కూడా చదవండి

గతంలో బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలకూ ఎదురైన అనుభవమే..

ఇలాంటి పరిస్థితిని దాదాపు అన్ని పార్టీల నేతలు ఎదుర్కొన్నారు. తెలంగాణకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఎంపీలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేద్దామనుకుని – రాష్ట్రంలో అమలయ్యే కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి ప్రశ్నలు అడిగితే.. వచ్చే సమాధానాలు ఒక్కోసారి విమర్శనాస్త్రాలను అందిస్తే.. ఒక్కోసారి తమనే ఇరకాటంలో పడేసేలా ఉండేవి. సాధారణంగా తాము అడిగిన ప్రశ్నలు కేంద్రం ఇచ్చే సమాధానాలను ఎంపీలు స్వయంగా నేరుగా మీడియా దృష్టికి తీసుకొస్తూ ఉంటారు. ఆ అంశం ప్రాధాన్యత, ప్రాముఖ్యతను బట్టి నేరుగా ప్రెస్ మీట్ పెట్టి మరీ కేంద్రం ఇచ్చిన సమాధానాల ఆధారంగా ప్రత్యర్థి రాజకీయ పార్టీపై విమర్శలు గుప్పిస్తుంటారు. అయితే ఒక్కోసారి తాము సంధించే ప్రశ్నలు బూమ్‌రాంగ్‌ అవుతుంటాయి. వచ్చిన సమాధానం మరోలా ఉంటే ఆ ప్రశ్న-సమాధానం గురించి ఊసే ఎత్తకుండా చుప్-చాప్ అయిపోతుంటారు.

Kanakamedala Ravindra Kumar

మరిన్ని జాతీయ వార్తల కోసం

హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?
హిట్టా.? ఫట్టా.? రవి తేజ హరీష్ Mr.బచ్చన్ సక్సెస్ అయ్యిందా.?
రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
రాయలసీమ థియేటర్లలో మెగా డాటర్ హంగామా.! కమిటీ కురోళ్ళు కలెక్షన్స్.
అలాంటి యాడ్స్‌ చేసినందుకు కొట్టాలి స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్!
అలాంటి యాడ్స్‌ చేసినందుకు కొట్టాలి స్టార్ హీరోలపై శక్తిమాన్ ఫైర్!
కూతురి కోసం తెగ కష్టపడుతున్న షారుఖ్.! వీడియో
కూతురి కోసం తెగ కష్టపడుతున్న షారుఖ్.! వీడియో
ఆమె మోజుతోనే బరి తెగించాడు.! అడ్డంగా బుక్కైన డీ - గ్యాంగ్
ఆమె మోజుతోనే బరి తెగించాడు.! అడ్డంగా బుక్కైన డీ - గ్యాంగ్
చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!
చై ఎంగేజ్‌మెంట్‌పై భర్తకు మద్దతుగా.. శ్రీవాణి సెటైరికల్ వీడియో.!
పెళ్లికి వేళాయెరా! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
పెళ్లికి వేళాయెరా! హీరో కిరణ్ అబ్బవరం ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్
బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!
బిగ్‌ బాస్‌లోకి బ్రహ్మముడి సీరియల్ హీరోయిన్ కావ్య.!
సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
సిల్క్‌ ఆఫ్ ఇండియా ఎక్స్‌పోను స్టార్ట్ చేసిన బిగ్ బాస్ అశ్విని..
దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం | ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.?
దేవర యాక్షన్ ఎఫెక్ట్‌ NTRకు గాయం | ఆ డైరెక్టర్‌తో సమంత డేటింగ్‌.?