- Telugu News Photo Gallery 7 Incredible Nutmeg Benefits: From Inducing Sleep to Relieving Pain Telugu News
జాజికాయ పొడితో ఎన్ని లాభాలో తెలుసా… సైంటిఫిక్ గా తేలిన వాస్తవాలు..!
జాజికాయ ఒక శక్తివంతమైన మసాలా దినుసు. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇది ప్రభావంలో వేడిగా ఉంటుంది. అయితే ఈ మసాలా దినుసులో యాంటీ డయాబెటిక్, యాంటీ క్యాన్సర్ గుణాలు ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆహారం తిన్న తర్వాత మీ రక్తంలో చక్కెర స్థాయి 200 mg/dL లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, మీకు మధుమేహం ఉన్నట్టు. దీనికి ఈ మసాలా అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది.
Updated on: Jul 21, 2023 | 8:24 PM

ఈ మసాలా క్యాన్సర్‌తో పోరాడుతుంది.. జాజికాయలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఫ్రీ-రాడికల్స్‌ను తొలగిస్తాయి. ఈ మూలకాలు DNA, కణాలను దెబ్బతీయడం ద్వారా క్యాన్సర్‌కు కారణమవుతాయి. అందుకే జాజికాయ తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడుకోవచ్చు.

వాపు చికిత్స..జాజికాయలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయి. మీరు నొప్పి, వాపుతో బాధపడుతున్నట్లయితే, మీరు ఈ మసాలాను ఉపయోగించడం ద్వారా ఉపశమనం పొందవచ్చు. మీరు దీన్ని ఆహారంలో లేదా టీలో కలుపుకుని తీసుకొవచ్చు.

ఎటువంటి ఇన్ఫెక్షన్ ఉండదు.. పదే పదే రోగాల బారిన పడిన వారు దీనిని తినవచ్చు. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది E. Coli వంటి ప్రమాదకరమైన బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది.

గుండె దృఢంగా ఉంటుంది. జాజికాయను ఉపయోగించడం వల్ల గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించవచ్చని పలు పరిశోధనల్లో తేలింది. ఈ ప్రమాదాలలో అధిక కొలెస్ట్రాల్, అధిక ట్రైగ్లిజరైడ్ వంటివి ఉంటాయి.

మానసిక ఆరోగ్యానికి గొప్పది.. పరిశోధనలో, జాజికాయ మానసిక ఆరోగ్యానికి మంచిదని గుర్తించారు. ఇది యాంటీ-డిప్రెసెంట్ ఫుడ్, ఇది మీ మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. మిమ్మల్ని డిప్రెషన్ నుండి దూరంగా ఉంచుతుంది. ఇది మీ ఆలోచనా సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది.





























