Ginger Price: టమాటా తర్వాత అల్లం ధరలకు రెక్కులు.. కిలో రూ.400.. ఎక్కడో తెలుసా..?
దేశంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడు సైతం కొనలేని పరిస్థితి నెలకొంది. ఒకవైపు టమాట ఆకాశన్నంటుతుంటే.. మరో వైపు అల్లం ధర కూడా అదే దారిలో పయనిస్తోంది. కిలో అల్లం ధర రూ.300 దాటింది..
Updated on: Jul 22, 2023 | 7:00 AM

దేశంలో కూరగాయల ధరలు మండిపోతున్నాయి. సామాన్యుడు సైతం కొనలేని పరిస్థితి నెలకొంది. ఒకవైపు టమాట ఆకాశన్నంటుతుంటే.. మరో వైపు అల్లం ధర కూడా అదే దారిలో పయనిస్తోంది. కిలో అల్లం ధర రూ.300 దాటింది. కర్ణాటకలో కిలో అల్లం కోసం రూ.400 వరకు వెచ్చించాల్సి వస్తోంది. దీంతో నాన్ వెజ్ తినే ప్రజకు బడ్జెట్ పెరగనుంది.

దేశంలోనే అల్లం ఉత్పత్తిలో కర్ణాటక రెండో స్థానంలో ఉంది. ఇదిలావుండగా ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఇదే సమయంలో రానున్న రోజుల్లో వీటి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు.

ప్రస్తుతం కర్నాటకలోని పలుచోట్ల రిటైల్ మార్కెట్‌లో కిలో అల్లం రూ.300 నుంచి రూ.400 వరకు విక్రయిస్తున్నారు. రాష్ట్రంలో 60 కిలోల అల్లం బస్తాను రూ.11 వేలకు విక్రయిస్తున్నట్లు కర్ణాటక రాజ్య రైతు సంఘం మైసూరు జిల్లా యూనిట్ చెబుతోంది.

గతేడాది వరకు దీని ధర 2000 నుంచి 3000 వేల రూపాయల మధ్య ఉండేది. హోల్‌సేల్ మార్కెట్‌లో ధరల పెరుగుదల కారణంగా రిటైల్ మార్కెట్‌లో ధరలు స్వయంచాలకంగా అనేక రెట్లు పెరిగాయి.

అయితే అల్లం ధరలు పెరగడం మైసూరు, మల్నాడు జిల్లాల రైతులకు వరంగా మారుతోంది. ఇక్కడ రైతులు అల్లం విక్రయం ద్వారా అధిక ఆదాయాన్ని పొందుతున్నారు. ఎందుకంటే ఈ రెండు జిల్లాల్లోనూ రైతులు పెద్ద ఎత్తున అల్లం సాగు చేస్తారు. మరోవైపు అల్లం ఉత్పత్తిదారు హోసూరు కుమార్ మాట్లాడుతూ.. గత దశాబ్ద కాలంలో అల్లం ధరలు ఇంత భారీగా పెరగడం ఎప్పుడూ జరగలేదన్నారు. ఇక తెగులు రాష్ట్రాల్లో కూడా ధర భారీగానే ఉంది. టమాట ధరలతో పాటు అల్లం ధర మరింత పెరిగే అవకాశం ఉంది.





























