Telangana: కరువు తీరింది..! భారీ వర్షాలకు ప్రగతి భవన్‌లో విరిసిన గులాబి నవ్వులు
వర్షాలు లేకపోతే... రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారు. అది ప్రకృతి వైపరిత్యమైనా... ప్రభుత్వంపై అసంతృప్తితో ఉంటారు రైతులు. కాళేశ్వరం కట్టినా కష్టాలు తీరడంలేదనే టాక్ మెదలవుతుంది. అంతే కాదు ఇదే అంశాన్ని ఎత్తుకుని ప్రజల్లోకి వెళతాయి ప్రతిపక్షాలు.
వర్షాకాలం మెదలైంది… అసలు వర్షాలు పడతాయె లేదో అనే ఆందోళనలో ఉన్న రైతాంగానికి కొంత ఊరట లభిందింది. హైదరాబాద్ జనాలకు మాత్రం చిరాకు మెదలైంది. గత ఎడాది వరదలు తలచుకుని ఆందోళన చెందుతున్నారు. కానీ, బయట భారీ వర్షాలు పడుతుంటే… ప్రగతిభవన్‌లో మాత్రం చిరునవ్వులు కనిపిస్తున్నాయట… హమ్మయ్య వానలు పడుతున్నాయి.. అంటు టెన్షన్ ఫ్రీ అయ్యారట పెద్దసార్…
గత నాలుగెళ్లుగా తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎడారిలా ఉండే రాష్ట్రం ఇప్పుడు పచ్చని గోదారిలా మారింది. కేసిఆర్ వ్యూహత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కూడా కొంత తోడవడంతో వరి ధాన్యరాసులు కనిపిస్తున్నాయి. ఎకంగా దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రంగా తెలంగాణ చేరుకుంది. మరోవైపు గులాబి పార్టి పేరు మార్చుకుని కిసాన్ సర్కార్ తీసుకొస్తామంటు దేశవ్యాప్తంగా పార్టిని విస్తరిస్తుంది బీఆర్‌ఎస్.
మరో ఆరు నెలల్లో రాష్ట్రంలో ఎన్నికలు రానున్నాయి. ఈ సమయంలో వానలు పడకపోతే ఎలా అని టెన్షన్ పడింది బీఆర్‌ఎస్ పార్టి. ఈ సారి కరువు తప్పదు అని అనేక జాతీయ సంస్థలు హెచ్చరించడంతో ఎన్నికలను ఎదుర్కోవడం ఎలా అనే ఆందోళన పార్టిలో మెదలైంది. వర్షాలు లేకపోతే… రైతులు తీవ్ర ఇబ్బందులు పడతారు. అది ప్రకృతి వైపరిత్యమైనా… ప్రభుత్వంపై అసంతృప్తితో ఉంటారు రైతులు. కాళేశ్వరం కట్టినా కష్టాలు తీరడంలేదనే టాక్ మెదలవుతుంది. అంతే కాదు ఇదే అంశాన్ని ఎత్తుకుని ప్రజల్లోకి వెళతాయి ప్రతిపక్షాలు.
గతంలొ కొన్ని ప్రభుత్వాలు కరువు రావడంవల్ల ఒడిపోయిన సందర్బాలున్నాయి. అయితే కొంత ఆలస్యంగానైనా వర్షాలు మెదలుకావడం.. ప్రాజెక్టులు నిండుతుండడంతో ప్రగతిభవన్‌లో వాతావరణం కూడా చల్లబడింది. ఇక ఎన్నికల్లో మనకు తిరగులేదు అనుకుంటున్నారట గులాబి నేతలు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..