Viral Video: క్రిష్ వచ్చి కాపాడుతాడని బిల్డింగ్‌పై నుంచి దూకిన విద్యార్థి..
వాటర్ తాగి వస్తానని తరగతి గది నుంచి బయటకు వచ్చాడు. రావడం రావడం బాల్కనీ నుంచి కిందకి దూకేశాడు. ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకాడు కాబట్టి గాయాలతో బయటపడ్డాడు.
క్రిష్, శక్తిమాన్.. పిల్లలకు బాగా సుపరిచితమైన పాత్రలు ఇవి. సమాజంలో ఎవరైనా ప్రమాదంలో ఉంటే కాపాడటానికి వారు వస్తారని పిల్లలు నమ్ముతారు. ఆ సినిమాల్లో చూపించిందే నిజమనుకొని ఓ చిన్నారి ప్రమాదాన్ని కొనితెచ్చుకున్నాడు. పదే పదే క్రిష్ సినిమా చూసిన ఓ 3వ తరగతి చదువుతున్న విద్యార్థి.. బిల్డింగ్‌పై నుంచి దూకాడు. క్రిష్ వచ్చి కాపాడుతాడని పాఠశాల మొదటి అంతస్తు నుంచి జంప్ చేశాడు. దీంతో విద్యార్థి ముక్కు, కాళ్ళు, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘటన పాఠశాలలోని సీసీటీవీలో రికార్డైంది. పాఠశాల సిబ్బంది గమనించి ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. యూపీలోని కాన్పూర్‌లో ఈ ఘటన జరిగింది.
బుధవారం స్కూల్‌కి వెళ్లిన సమయంలో విద్యార్థి క్రిష్ చిత్రంలో హృతిక్ రోషన్ పాత్ర చేసిన విన్యాసాలను రిపీట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. సినిమాలో ఓ వ్యక్తి ఎత్తైన భనవం నుండి దూకిన తర్వాత సూపర్‌హీరో క్రిష్ వచ్చి అతడిని కాపాడి సేఫ్‌గా నేలపై ల్యాండ్ చేస్తాడు. ఆ సీన్‌తో ప్రభావితమైన విద్యార్థి అదే విధమైన ఫీట్‌ను ప్రదర్శించాలని ప్లాన్ చేశాడు. వాటర్ తాగి వస్తానని క్లాస్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఈ పని చేశాడు.
कानपुर
कक्षा 3 के छात्र ने स्कूल बिल्डिंग से लगाई छलांग
स्कूल की पहली मंजिल से लगाई छलांग, गंभीर घायल
सुपर हीरो पर बनी फिल्म कृष से प्रेरित होकर लगाई छलांग
छात्र के मुंह, पैर में आई गंभीर चोट, अस्पताल में भर्ती
सीसीटीवी में कैद हुई पूरी घटना@kanpurnagarpol pic.twitter.com/I1MIvdXR3N
— Adv Karuna sharma (@asiamanchnews) July 21, 2023
పిల్లలు సినిమాలు, యానిమేషన్ వీడియోలు చూసి.. ఇలా భ్రమకు గురయ్యే అవకాశం ఉంది. తల్లిదండ్రులతో మాట్లాడుతున్నప్పుడు.. వారు తమ ఆలోచనలు వ్యక్తపరుస్తూ ఉంటారు. ఆ సమయంలో వారికి క్లియర్ కట్‌గా వివరించి చెప్పాలి కానీ ఏదో పరధ్యానంగా ఉండి ఊ కొట్టి వదిలేయకూడదు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..