ఆ గ్రామంలో పశువులు తిరగకుండా సర్పంచ్ వింత నిర్ణయం.. పాటించకపోతే ఇక అంతే సంగతులు
సాధారంగా గ్రామాల్లోని పశువులు వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. అంతేకాదు పట్టణాల్లో సైతం అప్పుడప్పుడు రోడ్లపై కనిపిస్తాయి. అయితే గ్రామాల్లో మాత్రం స్వేచ్ఛగా తిరిగే కొన్ని పశువులు కొన్నిసార్లు మనుషులను కూడా పొడవటానికి వస్తాయి.
సాధారంగా గ్రామాల్లోని పశువులు వీధుల్లో స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. అంతేకాదు పట్టణాల్లో సైతం అప్పుడప్పుడు రోడ్లపై కనిపిస్తాయి. అయితే గ్రామాల్లో మాత్రం స్వేచ్ఛగా తిరిగే కొన్ని పశువులు కొన్నిసార్లు మనుషులను కూడా పొడవటానికి వస్తాయి. ఇలా జరగడం వల్ల వారికి తీవ్ర గాయాలైన సందర్భాలు కూడా చాలానే చోటుచేసుకున్నాయి. అయితే మధ్యప్రదేశ్‌లో మాత్రం ఇలా పశువులు వీధుల్లో స్వేచ్ఛగా తిరగకుండా కొత్తగా ఓ నిబంధనను తీసుకొచ్చారు. అదే ఇప్పుడు వివాదస్పదమైంది. వివరాల్లోకి వెళ్తే శహడోల్ జిల్లా నగ్నాదుయ్ గ్రామంలోని విధుల్లో పశువులు తిరుగుతుండేవి. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతి కీలక నిర్ణయం తీసుకుంది.
గ్రామంలోని ప్రజలు పశువులను వీధుల్లో స్వేచ్ఛగా తిరగనివ్వకూడదని ఆ గ్రామ సర్పంచ్ ఈ నిబంధనను తీసుకొచ్చారు. రోడ్లపై వెళ్లేవారికి ఇబ్బందులు కలగకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఒకవేళ ఈ నిబంధనను కాదని పశువులను ఊరిలో స్వేచ్ఛగా విడిచిపెడితే… దాని యజమానికి అయిదు చెప్పు దెబ్బలు అలాగ రూ.500 జరిమానా విధిస్తామని ఊరంతా చాటింపు వేయించారు. అయితే ఈ నిర్ణయంపై గ్రామస్థులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తు్న్నారు. ఈ విషయంలో అధికారులు జోక్యం చేసుకుని తమ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.