Tirupati: పాపం.. ఇనుప పిల్లర్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి తల.. చివరకు

పాపం చిన్నారి ఎరక్కపోయి ఇరుక్కుపోయింది. సరాదాగా ఆడుకుంటూ వెళ్లి ఐరన్ పోల్‌ గ్రిల్స్ మధ్య తల పెట్టేసింది. బయటకు తీద్దామంటే వీలు కుదరలేదు. దీంతో అల్లాడిపోయింది.

Tirupati: పాపం.. ఇనుప పిల్లర్‌లో ఇరుక్కుపోయిన చిన్నారి తల.. చివరకు
Baby In Danger
Follow us
Raju M P R

| Edited By: Ram Naramaneni

Updated on: Jul 21, 2023 | 8:20 PM

తిరుపతి జిల్లా రేణిగుంట రైల్వే స్టేషన్ లో చిన్నారికి ప్రమాదం తప్పింది. 3 వ నంబర్ ఫ్లాట్ ఫామ్ పై పిల్లర్ లో 4 ఏళ్ల సాయి యశస్విని ఇరుక్కు పోయింది. సుమారు గంటకు పైగా నరక యాతన పడింది. చిత్తూరు వెళ్లేందుకు రాజంపేట నుంచి రేణిగుంట చేరుకున్న సాయికుమార్ ఫ్యామిలీ. దాదర్ ఎక్స్ ప్రెస్ లో రేణిగుంటకు చేరుకుకుంది. రాజంపేటకు చెందిన సాయి కుమార్ ఫ్యామిలీ చిత్తూరు వెళ్లే ట్రైన్ కోసం వేచి ఉండగా అక్కడే ఆడుకుంటున్న సాయి యశస్వి ప్రమాదానికి గురైంది. మరి కాసేపట్లో జయంత్ ఎక్స్ ప్రెస్ వస్తుందని ఎదురు చూస్తుండగా అక్కడే ఆడుకుంటున్న సాయి యశస్విని ఐరన్ పిల్లర్ మద్య తలపెట్టి బయటికి రాలేక ఇరుక్కు పోయింది. కేకలు వేస్తూ ఏడ్చింది. బయట రాలేక ఇబ్బంది పడ్డ చిన్నారిని గుర్తించిన తల్లిదండ్రులు, ప్రయాణికులు బయటకు లాగే ప్రయత్నం చేశారు. ఎంత ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోవడంతో రైల్వే అధికారులకు సమాచారం ఇచ్చారు.

దీంతో ఇనుప కట్టర్ల సహాయంతో పిల్లర్ ని కట్ చేసి పాపని సురక్షితం గా బయటకు తీసారు. సేఫ్ గా చిన్నారిని రైల్వే సిబ్బంది కాపాడడంతో ఊపిరి పీల్చుకున్నారు. చిన్న వయస్సులో పిల్లలు ఒకచోట కుదరుగా ఉండరు. తెలియక వెళ్లి ప్రమాదాల్లో పడుతూ ఉంటారు. అందుకే వారిని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండాలి. ప్రమాదాలు చెప్పి రావు. అందుకే పేరెంట్స్‌ అలెర్ట్‌గా ఉండాల్సిన అవసరం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

స్వప్న చేసిన తింగరి పని.. అడ్డంగా ఇరుక్కుపోయిన కావ్య!
స్వప్న చేసిన తింగరి పని.. అడ్డంగా ఇరుక్కుపోయిన కావ్య!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు