Tirumala: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. ఇకపై లక్కీడిప్‌లో సేవాటికెట్లు పొందిన భక్తులకు ‘పే లింక్’ ఎస్ఎంఎస్
తిరుమలలో ఆఫ్ లైన్ విధానంలో శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్ దర్శనం పొందిన భక్తులు టికెట్లు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు టీటీడీ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. పే లింక్ ఎస్ఎంఎస్ ద్వారా భక్తులు కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్ లో సొమ్ము చెల్లించి..
తిరుమలలో ఆఫ్ లైన్ విధానంలో శ్రీవారి ఆర్జితసేవలు, బ్రేక్ దర్శనం పొందిన భక్తులు టికెట్లు పొందే ప్రక్రియను మరింత సులభతరం చేసేందుకు టీటీడీ నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. పే లింక్ ఎస్ఎంఎస్ ద్వారా భక్తులు కౌంటర్ల వద్దకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆన్ లైన్ లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లను ప్రింట్ తీసుకోనే అవకాశం కల్పించింది. తిరుమల సీఆర్ఓలో లక్కీడిప్ ద్వారా ఆర్జిత సేవాటికెట్లను భక్తులకు కేటాయిస్తున్న టిటిడి ఈ విధానంలో టికెట్లు పొందిన భక్తులు కౌంటర్ వద్దకు వచ్చి సొమ్ము చెల్లించి టికెట్లు పొందాల్సి పని లేకుండా నూతన విధానంలో ఎస్ఎంఎస్ ద్వారా పే లింక్ ను పంపనుంది. భక్తులు ఆ లింక్ పై క్లిక్ చేసి యుపిఐ లేదా క్రెడిట్ కార్డు లేదంటే డెబిట్ కార్డు ద్వారా ఆన్ లైన్ లో సొమ్ము చెల్లించి సేవా టికెట్లు ప్రింట్ తీసుకోవచ్చు. ఈ నూతన విధానాన్ని ప్రస్తుతం సిఆర్వోలోని లక్కీడిప్ కౌంటర్ల వద్ద ప్రయోగాత్మకంగా అమలు చేస్తోంది. త్వరలో ఎంబీసీ-34 కౌంటర్ వద్ద విచక్షణ కోటాలో కేటాయించే ఆర్జిత సేవా టికెట్లు, బ్రేక్ దర్శన టికెట్లకు కూడా ఈ విధానం అమలు చేయనుంది.
కాగా అక్టోబర్ నెలకు సంబంధించి కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్రదీపాలంకార సేవా టికెట్లను ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది టీటీడీ. భక్తులు టీటీడీ అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ అధికారులు సూచించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..