AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 7: భార్యతో కలిసి బిగ్‌బాస్‌ లోకి వచ్చేస్తోన్నఫేమస్‌ డ్యాన్స్‌ మాస్టర్‌.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే..

బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టె కంటెస్టెంట్లపై సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ప్రముఖ టీవీ నటులు, సోషల్‌ మీడియా సెలబ్రిటీలు హౌస్‌లోకి రానున్నారనే తెలుస్తోంది. గత సీజన్లలో లాగానే ఈసారి కూడా రీల్‌ దంపతులు హౌస్‌లో సందడి చేయనున్నారట.

Bigg Boss 7: భార్యతో కలిసి బిగ్‌బాస్‌ లోకి వచ్చేస్తోన్నఫేమస్‌ డ్యాన్స్‌ మాస్టర్‌.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే..
Bigg Boss 7 Telugu
Basha Shek
|

Updated on: Jul 20, 2023 | 9:42 AM

Share

బుల్లితెర ఆడియెన్స్‌ను అలరించేందుకు బిగ్‌బాస్‌ మళ్లీ వస్తున్నాడు. ఇప్పటికే ఆరు సీజన్లను సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్‌ చేసుకున్న ఈ మెగా రియాలిటీ షో ఈసారి మరిన్ని హంగులతో మన ముందుకు రానుంది. ఆరో సీజన్‌లో కంటెస్టెంట్ల ఎంపికకకు సంబంధించి కొన్ని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఆ మిస్టేక్స్‌ జరగకుండా బిగ్‌బాస్‌ యాజమాన్యం జాగ్రత్త పడుతోంది. ఇందులో భాగంగా కంటెస్టెంట్ల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. మరోవైపు బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టె కంటెస్టెంట్లపై సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ప్రముఖ టీవీ నటులు, సోషల్‌ మీడియా సెలబ్రిటీలు హౌస్‌లోకి రానున్నారనే తెలుస్తోంది. గత సీజన్లలో లాగానే ఈసారి కూడా రీల్‌ దంపతులు హౌస్‌లో సందడి చేయనున్నారట. అమర్‌దీప్‌, తేజస్విని దంపతులు ఈసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. గత సీజన్‌లోనే వీరు రావాల్సి ఉండగా.. పెళ్లి కారణంగా రాలేపోయారట. అయితే ఈసారి మాత్రం హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయట. ఈ సంగతి పక్కన పెడితే ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ ఆట సందీప్‌, జ్యోతి జంట కూడా ఈ సీజన్‌లో కనిపించే అవకాశాలున్నాయట.

డ్యాన్స్‌ర్‌గా, కొరియోగ్రాఫర్‌గా ఆట సందీప్‌కు బోలెడు క్రేజ్‌ ఉంది. సినిమా ఫంక్షన్లు. ప్రీ రిలీజ్‌ ఈవెంట్ల వేదికలపై తనదైన శైలిలో డ్యాన్స్‌లు చేస్తుంటాడు. ఇక అప్పుడప్పుడు తన సతీమణితో కలిసి అదిరిపోయే స్టెప్పులు వేస్తుంటాడు. మెగాస్టార్ చిరంజీవి అభిమాని అయిన సందీప్‌ ఎక్కువగా ఆయన పాటలకే స్టెప్పులు వేస్తుంటాడు. దీంతో సందీప్ దంపతులను హౌస్‌లోకి తీసుకువస్తే షో మరింత రక్తి కడుతుందని బిగ్‌బాస్‌ నిర్వాహకులు భావిస్తున్నారట. మరోవైపు బిగ్‌బాస్‌ ఏడో సీజన్‌పై అప్డేట్స్‌ వస్తూనే ఉన్నాయి. ఇటీవలే టైటిల్‌ లోగో లాంఛ్‌ చేసిన స్టార్‌ మా తాజాగా మరొక ప్రోమోను రిలీజ్‌ చేసింది. ఎప్పటిలాగే హోస్ట్‌ అక్కినేని నాగార్జున స్టైలిష్‌ లుక్‌లో దర్శనమిచ్చాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
సిక్కోలు తీరంలో భారీ తిమింగలం...ఆ తర్వాత జరిగిందంటే? వీడియో
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
వజ్రాల లాకెట్‌ను మింగేసిన దొంగ.. ఆ తర్వాత.. ?
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
పుతిన్‌ మెనూలో గోంగూర పచ్చడి, బాదం హల్వా వీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
స్మృతి వేలి ఉంగరం మిస్సింగ్‌ అభిమానుల అనుమానాలువీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
ఒక్క ప్యాడ్‌ ఇప్పించండి ప్లీజ్‌.. కూతురి కోసం తండ్రి ఆవేదన వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
తండ్రి చితాభస్మంతో విమానాశ్రయంలో కుమార్తె వీడియో
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
ఎస్కలేటర్ కూడా రిపేర్ చేయలేరా.. లగేజీ మోసుకెళ్లిన ప్లేయర్లు వీడియ
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
టోకెన్‌ లేదనే టెన్షన్‌ వద్దు.. వైకుంఠ ద్వార దర్శనం ఇలా చేసుకోండి
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
చిన్నారుల పాలిట సైలెంట్‌ కిల్లర్‌పేరెంట్స్‌.. బీ అలర్ట్ వీడియో
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు
పంచాయతీ బరిలో మాజీమంత్రి తండ్రి.. ఆసక్తికరంగా పంచాయతీ ఎన్నికలు