Mahesh babu: మహేష్‌ ‘స్పైడర్‌’లో నటించిన ఈ పిల్లాడు గుర్తున్నాడా? ఇప్పుడెలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తెలుసా?

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, కోలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగ దాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం 'స్పైడర్‌'. రకుల్‌ ప్రీత్‌ సింగ్ హీరోయిన్‌గా నటించగా, ఎస్.జె.సూర్య విలన్‌గా కనిపించారు.

Mahesh babu: మహేష్‌ 'స్పైడర్‌'లో నటించిన ఈ పిల్లాడు గుర్తున్నాడా? ఇప్పుడెలా ఉన్నాడో, ఏం చేస్తున్నాడో తెలుసా?
Spyder Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 19, 2023 | 8:43 PM

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు, కోలీవుడ్‌ స్టార్ డైరెక్టర్ ఎ.ఆర్.మురుగ దాస్ కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘స్పైడర్‌’. రకుల్‌ ప్రీత్‌ సింగ్ హీరోయిన్‌గా నటించగా, ఎస్.జె.సూర్య విలన్‌గా కనిపించారు. సుమారు రూ. 125 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సస్పెన్స్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు కానీ. కానీ మహేష్‌ను ఢీకొట్టే భైరవుడి పాత్రలో సూర్య పెర్ఫామెన్స్‌కు అందరూ ఫిదా అయ్యారు. ఆ సినిమాతోనే తనలోని అసలైన విలనిజాన్ని బయటపెట్టారీ ట్యాలెంటెడ్‌ యాక్టర్‌. అయితే ఇందులో చిన్నప్పటి భైరవుడిగా మాస్టర్‌ సంజయ్‌ నటించాడు. పక్కనోడి ఏడ్పులో ఆనందాన్ని వెతుక్కునే డిఫరెంట్ మెంటాలిటీ ఉన్న క్యారెక్టర్‌ పాత్రలో సంజయ్‌ అద్భుతంగా నటించాడు. అలాగే ఎవరికీ అంతు చిక్కకుండా మర్డర్లు చేయడం, వారి అంత్యక్రియలకే వెళ్లడం, అక్కడ మృతుల బంధువుల ఏడుపును చూసి నవ్వడం.. ఇలా ఒక సైకో కిడ్‌ క్యారెక్టర్‌లో సూపర్బ్‌గా నటించాడు. స్పైడర్ తర్వాత సంజయ్‌ పలు తమిళ్‌ సినిమాల్లో నటించాడు. మూగమని, జాక్‌పాట్, దర్బార్‌ వంటి సినిమాల్లో చైల్డ్‌ ఆర్టిస్టుగా మెప్పించాడు.

సినిమాల సంగతి పక్కన పెడితే సంజయ్‌కు కుట్టీ టాకీస్‌ పేరుతో సొంతంగా ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ ఉంది. అందులో తన డ్యాన్స్‌ అండ్‌ ఫుడ్డీ వీడియోలను తరచూ షేర్‌ చేస్తుంటాడు. అలాతే తన రీల్స్, డ్యాన్స్‌ వీడియోలను కూడా సోషల్‌ మీడియాలో పంచుకుంటాడు. వీటికి నెటిజన్ల నుంచి మంచి స్పందన వస్తుంటుంది. ముఖ్యంగా సంజయ్‌ మంచి ఈజ్‌, గ్రేస్‌ తో వేసే స్టెప్పులు నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?