Vijay Deverakonda: నా ప్రేమ ఇలాగే ఉంటుంది.. ఖుషి నుంచి వీడియో షేర్ చేసిన విజయ్ దేవరకొండ..
నా రోజా నువ్వే, ఆరాధ్య పాటలకు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఆరాధ్య పాటలో సమంత, విజయ్ కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. ఈ పాటకు అడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ ఓ రొమాంటిక్ వీడియో షేర్ చేశారు.
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం ఖుషి. ఇందులో సమంత కథానాయికగా నటిస్తుండగా.. డైరెక్టర్ శివ నిర్వాణ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ లవ్ స్టోరీగా వస్తోన్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్ ఆకట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ గురించి చెప్పక్కర్లేదు. నా రోజా నువ్వే, ఆరాధ్య పాటలకు సోషల్ మీడియాలో అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ఆరాధ్య పాటలో సమంత, విజయ్ కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. ఈ పాటకు అడియన్స్ నుంచి విశేష స్పందన వచ్చింది. ఇటీవలే ఈ మూవీ చిత్రీకరణ పూర్తి కాగా.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా విజయ్ ఓ రొమాంటిక్ వీడియో షేర్ చేశారు.
ఆరాధ్య పాటలోని మోస్ట్ రొమాంటిక్ క్లిప్ ను షేర్ చేస్తూ.. నా ప్రేమ కూడా ఇలాగే ఉంటుంది అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరలవుతుండగా.. ఆ వీడియోలో సామ్, విజయ్ మధ్య కెమిస్ట్రీ చూసి క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. మహానటి సినిమా తర్వాత విజయ్, సమంత.. పూర్తి స్థాయిలో జతగా నటిస్తోన్న సినిమా ఇది. ఈ సినిమాను సెప్టెంబర్ 1న తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లోనూ విడుదల చేయనున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.