BRO Movie: ‘బ్రో’ సెన్సార్ కంప్లీట్..పవన్, సాయి ధరమ్ తేజ్ మూవీ రన్ టైమ్ ఎంతంటే..
అంతేకాకుండా ఇటీవల విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్ట్ ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికేట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోను నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టీ ట్వీట్టర్ వేదికగా షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు మేకర్స్. ఇక మామ, మేనల్లుడు కలిసి నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ దాదాపు 2 గంటల 16 నిమిషాల రన్ టైమ్ అని తెలుస్తోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ కలిసి నటిస్తోన్న సినిమా బ్రో. నటుడు సముద్రఖని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మొదటిసారి పవన్, సాయి తేజ్ కాంబోలో ఈమూవీ వస్తుండడంతో అభిమానులలో ఆసక్తి నెలకొంది. అంతేకాకుండా.. ఈ సినిమాలో మరోసారి దేవుడిగా అలరించనున్నారు పవన్. తమిళంలో భారీ విజయాన్ని అందుకున్న వినోదయ సిత్తం సినిమాకు తెలుగు రీమేక్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ కథానాయికలుగా నటిస్తుండగా.. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అంతేకాకుండా ఇటీవల విడుదలైన ట్రైలర్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్ట్ ఈ సినిమాకు క్లీన్ యూ సర్టిఫికేట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోను నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టీ ట్వీట్టర్ వేదికగా షేర్ చేస్తూ సంతోషం వ్యక్తం చేశారు మేకర్స్. ఇక మామ, మేనల్లుడు కలిసి నటించిన ఈ కామెడీ ఎంటర్టైనర్ దాదాపు 2 గంటల 16 నిమిషాల రన్ టైమ్ అని తెలుస్తోంది.
ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ షేర్ చేసిన ట్వీట్ పై డైరెక్టర్ సముద్రఖని, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ స్పందిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. ఈసినిమాలో పవన్, తేజ్ మధ్య బాండింగ్ ఎక్కువగా ఉంటుందని.. ఇందులో పవన్ చిన్న ఫైట్ సీన్ కూడా ఉంటుందట. అయితే ఇందులో మెయిన్ లీడ్ సాయితేజ్ కాగా.. పవన్ ముఖ్య పాత్ర అని తెలుస్తోంది. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 28న విడుదల కాబోతుంది.




ప్రస్తుతం డైరెక్టర్ సముద్రఖని, సాయితేజ్ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. ఈ మూవీ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి తేజ్ తన పెళ్లి గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. విరూపాక్ష సినిమా హిట్ కావడంతో తన పెళ్లిపై కాస్త హోప్ వచ్చిందని.. కానీ బ్రో సినిమాతో అది కాస్త పూర్తిగా పోయిందని అన్నారు. ఇప్పుడు అమ్మాయిలు, అబ్బాయిలు తనను బ్రో అని పిలుస్తున్నారని సరదాగా చెప్పుకొచ్చాడు సాయి తేజ్.
#BroTheAvatar is all set for ‘U’niversal Entertainment 💥
Censored with U ✅
Grand Worldwide Release on July 28th 🥁@PawanKalyan @IamSaiDharamTej @TheKetikaSharma @thondankani @MusicThaman @vishwaprasadtg @vivekkuchibotla @sujithvasudev @NavinNooli @lemonsprasad @SVR4446… pic.twitter.com/0z7Hsjbo4h
— People Media Factory (@peoplemediafcy) July 19, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.