Kajal Aggarwal: ఎలాంటి పబ్లిసిటీ లేకుండానే రిలీజ్ అవుతోన్న కాజల్ సినిమా.. తెలుగులో కార్తీక పేరుతో ..
ఇవే కాకుండా.. కొద్ది రోజుల క్రితం ఆమె ప్రధాన పాత్రలో తమిళంలో కరుంగాపియం చిత్రం రూపొందింది. హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే ఈ సినిమాను ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. తమిళంలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రాబోతుంది. శ్రీ వెంకటసాయి ఫిలిమ్స్ వారు ఈ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు.

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్.. పెళ్లి తర్వాత కూడా జోరు కొనసాగిస్తోంది. పెళ్లి, ప్రెగ్నెన్సీ తర్వాత కొద్ది రోజులు సినిమాలకు దూరంగా ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే రీఎంట్రీ ఇస్తుంది. ప్రస్తుతం ఆమె నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తోన్న భగవంత్ కేసరి చిత్రంలో నటిస్తోంది. అలాగే కమల్ హాసన్, శంకర్ రాంబోలో రూపొందుతున్న ఇండియన్ 2 సినిమాలోనూ నటిస్తోంది. ఇవే కాకుండా.. కొద్ది రోజుల క్రితం కాజల్ ప్రధాన పాత్రలో తమిళంలో కరుంగాపియం చిత్రం రూపొందింది. హారర్ థ్రిల్లర్ జోనర్లో నడిచే ఈ సినిమాను ఇటీవల ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో రిలీజ్ చేశారు. తమిళంలో మంచి రెస్పాన్స్ అందుకున్న ఈ సినిమా ఇప్పుడు తెలుగులో రాబోతుంది. శ్రీ వెంకటసాయి ఫిలిమ్స్ వారు ఈ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు.
కార్తీక పేరుతో ఈ సినిమాను జూలై 21న రిలీజ్ చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే కొద్ది రోజులుగా ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి అప్డేట్ కనిపించడం లేదు. అయితే ఇక ఇప్పుడు మరోసారి ఈ సినిమా రిలీజ్ డేట్ గుర్తుచేశారు మేకర్స్. విడుదల సమయం దగ్గరకు వస్తోన్న సినిమా పబ్లిసిటీ ఏమాత్రం లేదు. ఎలాంటి ప్రచార కార్యక్రమాలు లేకుండా నేరుగా ఈ మూవీని థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు.




ఇదిలా ఉంటే.. ఈ సినిమా గురించి కాజల్ సైతం ఎలాంటి పోస్ట్స్ పెట్టకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ సినిమాకు ప్రసాద్ సంగీతం అందించగా.. రెజీనా, జనని, రైజా విల్సన్ కీలకపాత్రలు పోషించారు. ఈ చిత్రానికి డీకే దర్శకత్వం వహించగా.. మరో రెండు రోజుల్లో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.