Sitara: చిన్న వయసులోనే గొప్ప మనసు.. పుట్టిన రోజున బాలికలకు సైకిళ్లను బహుమతిగా ఇచ్చిన సితార.. వీడియో చూశారా?

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు- నమ్రతా శిరోద్కర్‌ల గారాల పట్టి సితార ఘట్టమనేని మరోసారి తన పెద్ద మనసును చాటుకుంది. సాధారణంగా స్టార్‌ కిడ్స్‌ పుట్టిన రోజు అంటే హంగులు, ఆర్భాటాలు, కేక్‌ కటింగులు, పార్టీలు గట్రా చాలా ఉంటాయి. అయితే మహేష్‌ అడుగుజాడల్లో నడుస్తోన్న సితార సింపుల్‌గా తన పుట్టిన రోజు సెలబ్రేట్‌ చేసుకుంది.

Sitara: చిన్న వయసులోనే గొప్ప మనసు.. పుట్టిన రోజున బాలికలకు సైకిళ్లను బహుమతిగా ఇచ్చిన సితార.. వీడియో చూశారా?
Sitara Birthday
Follow us
Basha Shek

|

Updated on: Jul 20, 2023 | 12:31 PM

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌ బాబు- నమ్రతా శిరోద్కర్‌ల గారాల పట్టి సితార ఘట్టమనేని మరోసారి తన పెద్ద మనసును చాటుకుంది. సాధారణంగా స్టార్‌ కిడ్స్‌ పుట్టిన రోజు అంటే హంగులు, ఆర్భాటాలు, కేక్‌ కటింగులు, పార్టీలు గట్రా చాలా ఉంటాయి. అయితే మహేష్‌ అడుగుజాడల్లో నడుస్తోన్న సితార సింపుల్‌గా తన పుట్టిన రోజు సెలబ్రేట్‌ చేసుకుంది. మహేష్‌ బాబు ఫౌండేషన్‌లోని అమ్మాయిలతో కలిసి కేట్‌ కట్‌ చేసిన సితార వారందరికీ ప్రేమతో కేక్‌ తినిపించింది. వారితో సరదాగా ముచ్చటించింది. సెలబ్రేషన్స్‌ అనంతరం అక్కడున్న అమ్మాయిలందరికీ పింక్‌ కలర్‌లో ఉన్న సైకిళ్లను బహుమతిగా ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియోను నమ్రత సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ‘ఇప్పుడు ఆ బాలికలు ఎంతో హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు వారందరికీ స్కూల్‌ కేవలం సైకిల్‌ దూరంలో మాత్రమే ఉంది. నీలో ఇతరులపై అమితమైన ప్రేమను చూపించే గొప్ప మనసు ఉంది. నీ అద్భుతమైన జీవితంలో ఇలాంటి అర్థవంతమైన మధుర జ్ఞాపకాలు మరెన్నో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్‌ డే సితార‘ అని తన కూతురికి బర్త్‌ డే విషెస్‌ చెప్పింది నమ్రత.

ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు మహేష్‌ కూతురు పెద్ద మనసును ప్రశంసిస్తూ కామెంట్లు పెడుతున్నారు. అలాగే తను మరెన్నో పుట్టిన రోజులు జరుపుకోవాలంటూ ఆకాంక్షిస్తున్నారు. కాగా తన కూతురికి సోషల్‌ మీడియా వేదికగా బర్త్‌ డే విషెస్‌ చెప్పాడు మహేష్‌. ’11వ పడిలోకి అడుగు పెట్టిన నా చిన్నారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. నా ప్రపంచంలో నువ్వే స్టార్‌వి. నువ్వు దేన్నైనా సాధించగలవు’ అని మహేష్‌ విషెస్‌ చెప్పాడు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.