The Kerala Story OTT : ‘ది కేరళ స్టోరీ’ ఓటీటీ రిలీజ్‌పై హింట్‌ ఇచ్చిన అదా శర్మ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

ప్రస్తుతం థియేటర్లలో విడుదలైన సినిమాలు నెల రోజులకే ఓటీటీలోకి దర్శనమిస్తున్నాయి. కొన్ని మూవీస్‌ అయితే ఏకంగా మూడో వారంలోనే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. అదే సమయంలో మరి కొన్ని చిత్రాలు మాత్రం ఓటీటీల మాట ఎత్తడం లేదు. అక్కినేని అఖిల్‌ ఏజెంట్, గోపీచంద్‌ రామబాణం, అలాగే అదా శర్మ ది కేరళ స్టోరీ సినిమాలు...

The Kerala Story OTT : 'ది కేరళ స్టోరీ' ఓటీటీ రిలీజ్‌పై హింట్‌ ఇచ్చిన అదా శర్మ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
The Kerala Story Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 20, 2023 | 2:00 PM

ప్రస్తుతం థియేటర్లలో విడుదలైన సినిమాలు నెల రోజులకే ఓటీటీలోకి దర్శనమిస్తున్నాయి. కొన్ని మూవీస్‌ అయితే ఏకంగా మూడో వారంలోనే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు వస్తున్నాయి. అదే సమయంలో మరి కొన్ని చిత్రాలు మాత్రం ఓటీటీల మాట ఎత్తడం లేదు. అక్కినేని అఖిల్‌ ఏజెంట్, గోపీచంద్‌ రామబాణం, అలాగే అదా శర్మ ది కేరళ స్టోరీ సినిమాలు థియేటర్లలో నెలలు గడుస్తున్నాయి. కానీ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనలు రాలేదు. ముఖ్యంగా ది కేరళ స్టోరీ డిజిటల్‌ స్ట్రీమింగ్‌ రైట్స్‌కు సంబంధించి డైరెక్టర్‌ సుదీప్తోసేన్‌ ఆ మధ్యన కొన్ని సంచలన వ్యాఖ్యలుచేశారు. మే 5న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు ఏ ఓటీటీ సంస్థ ముందుకు రావడం లేదన్నారు. ఇండస్ట్రీలో ఒక గ్యాంగ్‌ తమ సినిమాపై కక్ష కట్టిందని సెన్సేషనల్‌ కామెంట్స్‌ చేశారు. మరోవైపు ఈ కాంట్రవర్సీ మూవీని ఓటీటీలో చూసేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. ఈక్రమంలో హీరోయిన్ అదాశర్మ ది కేరళ స్టోరీ ఓటీటీ రిలీజ్‌పై ఒక హింట్‌ ఇచ్చింది. తమ సినిమాను ఒక ఓటీటీ సంస్థ కొనుగోలు చేసిందని, త్వరలోనే డిజిటల్‌ స్ట్రీమింగ్‌కు తీసుకువస్తామని పేర్కొంది.

అయితే కొన్ని నివేదిలక ప్రకారం ‘ది కేరళ స్టోరీ’ ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ జీ 5 తీసుకుందట. అయితే స్ట్రీమింగ్‌ సమయానికి సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రిలీజ్‌ చేయలేదు. బహుశా ఆగస్టులోనే ది కేరళ స్టోరీని ఓటీటీలోకి అందుబాటులోకి తీసుకురావచ్చని తెలుస్తోంది. కాగా కేరళలో వెలుగు చూసిన లవ్‌ జిహాద్‌ అంశాన్ని నేపథ్యంగా తీసుకుని ది కేరళ స్టోరీ సినిమాను తెరకెక్కించారు. ఎన్నో వివాదాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ.200 కోట్ల కలెక్షన్లు రాబట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..