Pareshan Movie: ఓటీటీలోకి ‘పరేషాన్’ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు ఎక్కడంటే..
ఈ చిత్రంలో యువ నటుడు, మసూదా ఫేమ్ తిరువీర్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రంలో పావని కరణం కథానాయికగా నటించగా.. బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, రవి, రాజు బేడిగల కీలకపాత్రలలో నటించారు. ఇప్పటివరకు థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమయ్యింది.
ఇటీవల చిన్న సినిమాగా అడియన్స్ ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్న సినిమా పరేషాన్. పాన్ ఇండియా స్టార్ రానా సమర్పణలో వచ్చిన ఈచిత్రానికి రూపక్ రొనాల్డ్ సన్ దర్శకత్వం వహించారు. జూన్ నెలలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది. ఈ చిత్రంలో యువ నటుడు, మసూదా ఫేమ్ తిరువీర్ ప్రధాన పాత్రలో నటించారు. ఇక ఈ చిత్రంలో పావని కరణం కథానాయికగా నటించగా.. బన్నీ అభిరన్, సాయి ప్రసన్న, అర్జున్ కృష్ణ, రవి, రాజు బేడిగల కీలకపాత్రలలో నటించారు. ఇప్పటివరకు థియేటర్లలో సందడి చేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో అలరించేందుకు సిద్ధమయ్యింది.
ఈ సినిమా ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీలీవ్ వేదికగా ఆగస్ట్ 4న స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఓ ప్రత్యేక వీడియో రిలీజ్ చేసింది మూవీ టీం. ప్రాంతీయ కథలకు ఆదరణ లభిస్తోన్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వస్తుండడంతో సినీ ప్రియులు ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. మంచిర్యాలలో సింగరేణి ఉద్యోగి సమర్పణ్ కొడుకు ఐజాక్ (తిరువీర్) గ్రామంలో జులాయిగా తిరుగుతుంటాడు. మరోవైపు తన కుమారుడికి ఉద్యోగం వచ్చేలా చేయాలని.. తన భార్య బంగారు ఆభరణాలు అమ్మి డబ్బు జమ చేస్తాడు. అయితే ఆ డబ్బును తన స్నేహితుడికి సాయం చేసేందుకు ఉపయోగిస్తాడు ఐజాక్. అదే గ్రామంలో ఉండే శిరీష (పావని)తో ప్రేమలో పడతాడు. ఇక ఆ తర్వాత శిరీష ప్రెగ్నెంట్ కావడంతో ఆమెను హైదరాబాద్ ఆసుపత్రిలో చూపించాలనుకుంటాడు ఐజాక్. అయితే అతని వద్ద ఉండే డబ్బు, బైక్ తీసుకుని ఐజాక్ స్నేహితుడు పారిపోతాడు. ఆ తర్వాత ఐజాక్, శిరీష పరిస్థితి ఏమైంది.. ?. డబ్బుతో పారిపోయిన సత్తి దొరికాడా ? అనేది సినిమా.
What if your best friends turn out to be your worst nightmares?
Rana Daggubati presents the quirkiest film of the year, #Pareshan streaming on Sony LIV from Aug 4th.#Pareshan #PareshanOnSonyLIV #SonyLIV @RanaDaggubati @iamThiruveeR @PavaniKaranam1 @imvishwadev @siddharthr87 pic.twitter.com/Ic8SXK3apg
— Sony LIV (@SonyLIV) July 20, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.