Netflix: ఇండియాలో యూజర్స్‌‌కి షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇక ఆ వెసులుబాటు లేనట్లే..!

Netflix News: ఇండియాలో తన యూజర్లకు షాక్ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. పాస్‌వర్డ్ షేరింగ్ ఆప్షన్‌ను క్లోజ్ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన చేసిన నెట్‌ఫ్లిక్స్ ఒక ఇంటి సభ్యులు ఒక అకౌంట్‌ను మాత్రమే యాక్సస్ చేయగలరని స్పష్టం చేసింది. గత సంవత్సరం నెట్‌ఫ్లిక్స్ యూజర్లు భారీగా పడిపోయిన నేపథ్యంలో..

Netflix: ఇండియాలో యూజర్స్‌‌కి షాక్ ఇచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇక ఆ వెసులుబాటు లేనట్లే..!
Netflix
Follow us
Shiva Prajapati

|

Updated on: Jul 20, 2023 | 12:29 PM

Netflix News: ఇండియాలో తన యూజర్లకు షాక్ ఇచ్చింది నెట్‌ఫ్లిక్స్. పాస్‌వర్డ్ షేరింగ్ ఆప్షన్‌ను క్లోజ్ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన చేసిన నెట్‌ఫ్లిక్స్ ఒక ఇంటి సభ్యులు ఒక అకౌంట్‌ను మాత్రమే యాక్సస్ చేయగలరని స్పష్టం చేసింది. గత సంవత్సరం నెట్‌ఫ్లిక్స్ యూజర్లు భారీగా పడిపోయిన నేపథ్యంలో.. తిరిగి యూజర్లను పెంచుకోవడానికి అనేక ప్రయోగాలు చేసింది. ఇందులో భాగంగా యూజర్లు తమ కుటుంబ సభ్యులతో, సమీప బంధువులతో పాస్‌వర్డ్‌లను షేర్ చేసుకోవచ్చని ప్రకటించింది. ఒక కుటుంబానికి చెందిన వ్యక్తులు ఎక్కడ ఉన్నా నెట్‌ఫ్లిక్స్‌ను ఇంట్లో, ప్రయాణంలో, వెకేషన్‌లో ఉన్నా ఆ అకౌంట్ యాక్సెస్ చేసుకునే వెసులుబాటు కల్పించింది. ఆ తరువాత నెట్‌ఫ్లిక్స్ తన నిర్ణయాన్ని క్రమంగా వెనక్కి తీసుకుంటూ వచ్చింది.

గత మే నెలలో నెట్‌ఫ్లిక్స్ యునైటెడ్ స్టేట్స్, బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఆస్ట్రేలియా, సింగపూర్, మెక్సికో, బ్రెజిల్ సహా 100 కంటే ఎక్కువ దేశాల్లో పాస్‌వర్డ్ షేరింగ్‌పై పరిమితులు విధించింది. ఈ క్రమంలోనే తాజాగా ఇండియాలోనే పాస్‌వర్డ్ షేరింగ్‌ను నిలిపివేసింది నెట్‌ఫ్లిక్స్. అయితే, ఈ నిర్ణయం వలన ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 6 మిలియన్ల మంది కొత్త యూజర్లు నెట్‌ఫ్లిక్స్‌కు వచ్చారు. ఈ స్ట్రీమింగ్ దిగ్గజం.. తాజా త్రైమాసికంలో మొత్తం 238 మిలియన్ల సబ్‌స్ర్కైబర్లతో 1.5 బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించినట్లు ఒక ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఓటీటీ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?