Tollywood: ఈ ఫొటోలోని చిన్నారిని గుర్తుపట్టారా? టాలీవుడ్ స్టార్‌ హీరో సతీమణి.. ఇటీవలే అమ్మగా ప్రమోషన్‌

ఈమె ఇప్పుడు ఓ టాలీవుడ్ సెలబ్రిటీ. స్టార్‌ హీరో సతీమణి. అటు పుట్టినిల్లు.. ఇటు మెట్టినిల్లు.. రెండు బాగా పేరున్న ఫ్యామిలీలే. అయితే స్వతంత్ర్య భావాలు కలిగిన ఆమె తనకంటూ ఓ ప్రత్యేక ఐడెంటిటీని తెచ్చుకుంది. సక్సెస్‌ ఫుల్‌ బిజినెస్‌ వుమన్‌గా పేరు పొందింది.

Tollywood: ఈ ఫొటోలోని చిన్నారిని గుర్తుపట్టారా? టాలీవుడ్ స్టార్‌ హీరో సతీమణి.. ఇటీవలే అమ్మగా ప్రమోషన్‌
Tollywood Celebrity
Follow us
Basha Shek

|

Updated on: Jul 20, 2023 | 10:57 AM

పై ఫొటోలో ఉన్న చిన్నారిని గుర్తుపట్టారా? పోలికలు చూసి గుర్తుపట్టేయచ్చు. ఈమె ఇప్పుడు ఓ టాలీవుడ్ సెలబ్రిటీ. స్టార్‌ హీరో సతీమణి. అటు పుట్టినిల్లు.. ఇటు మెట్టినిల్లు.. రెండు బాగా పేరున్న ఫ్యామిలీలే. అయితే స్వతంత్ర్య భావాలు కలిగిన ఆమె తనకంటూ ఓ ప్రత్యేక ఐడెంటిటీని తెచ్చుకుంది. సక్సెస్‌ ఫుల్‌ బిజినెస్‌ వుమన్‌గా పేరు పొందింది. అలాగే తన సేవా కార్యక్రమాలతో గొప్ప మనసును చాటుకుంటోంది. ఒక ఫౌండేషన్‌ బాధ్యతలను భుజాలకేసుకుని మరీ ఛారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ముఖ్యంగా మూగజీవాల సంరక్షణ కోసం తన వంతు కృషి చేస్తోంది. అన్నట్లు ఇటీవలే ఆమె తన జీవితంలో సరికొత్త ఆధ్యాయానికి శ్రీకారం చుట్టింది. అమ్మగా ప్రమోషన్‌ పొందింది. ఈ పాటికే అర్థమై ఉంటుంది. మనం ఎవరి గురించి మాట్లాడుతన్నామో? యస్‌.. ఆమె మరెవరో కాదు మెగా కోడలు, రామ్ చరణ్‌ సతీమణి కొణిదెల ఉపాసన. ఇవాళ (జులై 20) ఆమె పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు మెగా కోడలికి బర్త్‌ డే విషెస్‌ చెబుతున్నారు.

ఇటీవలే రామ్‌ చరణ్‌-ఉపాసన దంపతులు అమ్మానాన్నలుగా ప్రమోషన్‌ పొందారు. జూన్ 20న అపోలో ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది మెగా కోడలు. పెళ్లైన సుమారు 11 ఏళ్లకు బిడ్డ జన్మించిడంతో అటు మెగా ఫ్యామిలీలో, అటు ఉపాసన కుటుంబంలో ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇటీవలే తన కూతురికి క్లింకార అని నామకరణం చేశారు ఉప్సీ దంపతులు. ప్రస్తుతం తన గారాల పట్టి ఆలనాపాలనలో బిజిబిజీగా ఉంటోంది ఉపాసన.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.