- Telugu News Photo Gallery Cricket photos ODI World Cup 2023: Cricket Fans Booking Hospital Beds For IND vs PAK Clash In Ahmadabad amid Price hike of Hotel Rooms in the City
World Cup 2023: భారత్-పాక్ మ్యాచ్ కోసం ‘హెల్త్ చెకప్’ చేయిస్తున్న ఎన్ఆర్ఐలు.. ఎందుకో తెలిస్తే నవ్వుకోవాల్సిందే..!
IND vs PAK, CWC 2023: క్రికెట్ వరల్డ్ కప్ 2023 భారత్ వేదికగా అక్టోబర్ 5వ నుంచి జరగనుంది. ఇక మెగా టోర్నీలో భాగంగా భారత్, పాకిస్థాన్ జట్లు అక్టోబర్ 15న తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో పలు దేశాల్లోని ఎన్ఆర్ఐలు, క్రికెట్ అభిమానులు హాస్పిటల్ బాట పడుతున్నారు. అసలు వారు హాస్పిటల్ వైపు చూడడానికి, భారత్, పాక్ మ్యాచ్‌కి సంబంధం ఏమిటంటే..?
Updated on: Jul 23, 2023 | 12:20 PM

IND vs PAK: భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి 2023 వన్డే వరల్డ్ కప్ టోర్నీ ప్రారంభం కానుంది. ఇక అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో టోర్నీ ప్రారంభ మ్యాచ్, ఫైనల్ సహా మొత్తం 5 మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటితో పాటు యావత్ క్రికెట్ ప్రపంచం ఎదురుచూస్తున్న భారత్, పాకిస్థాన్ మ్యాచ్ కూడా అహ్మదాబాద్‌లోనే అక్టోబర్ 15న జరగనుంది.

ఈ కారణంగా అహ్మదాబాద్‌లోని స్థానిక, సమీప హోటళ్ల ధరలు ఆకాశానికి చేరాయి. సాధారణ రోజుల్లో 7 లేదా 8 వేల రూపాయలు ఉండే లగ్జరీ హోటల్ గదుల ధర ఏకంగా 40 నుంచి 60 వేల వరకు పెరిగింది. అంత ధర పలికినా దాదాపుగా 70 శాతం హోటల్ బుకింగ్స్ అయిపోయాయని పలు హోటళ్లు ఇప్పటికే అంటున్నాయి.

ఇంకా విమాన ధరలు కూడా అధికమయ్యాయి. ఈ నేపథ్యంలో ఎలా అయినా వరల్డ్ కప్ ప్రారంభ మ్యాచ్, ఫైనల్ మ్యాచ్.. ముఖ్యంగా భారత్-పాకిస్థాన్ మ్యాచ్ చూడాలని విదేశీ క్రికెట్ అభిమానులు, ఎన్ఆర్ఐలు హాస్పిటల్ బెడ్‌లను బుక్ చేసుకుంటున్నారు.

అక్టోబర్ 15న జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్ నేపథ్యలో పలు హోటళ్లు తమ ధరలను పదిరెట్లు పెంచేశాయి. దీంతో హాస్పిటల్‌లో బెడ్‌ని బుక్ చేసుకుని అటు నుంచి మ్యాచ్ చూసేందుకు వెళ్లవచ్చని పలువురు క్రికెట్ అభిమానులు వినూత్న రీతిలో ప్రయత్నిస్తున్నారు.

ఇందు కోసం చాలా మంది క్రికెట్ అభిమానులు ఫుల్ బాడీ చెకప్ పేరుతో మొత్తం బ్లాక్‌లను బుక్ చేసుకుంటున్నారు. వైద్యుల ప్రకారం హాస్పిటల్ బెడ్‌లు, గదుల కోసం అమెరికా, కెనడా, కెన్యా వంటి అనేక దేశాల నుంచి బుకింగ్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్టోబర్ 15న జరిగే చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌లో అభిమానుల ఉత్సాహం ఏ విధంగా ఉంటుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే..





























