- Telugu News Photo Gallery Cricket photos IND vs WI 2nsd Test: Team India accomplish unique batting record during 2nd Test against West Indies
IND vs WI: రెండో టెస్టులో పరుగుల సునామీ.. ఇంగ్లాండ్ ‘బజ్‌బాల్’కి టీమిండియా షాక్.. శ్రీలంక, ఆస్ట్రేలియా రికార్డులు గల్లంతు..
IND vs WI 2nd Test: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో భారత్‌ని ఎలా అయినా గెలిపించాలనుకున్న రోహిత్-యశస్వీ జోడీ.. టెస్ట్ నాల్గో రోజు విజృంభించారు. కేవలం 71 బంతుల్లోనే 98 పరుగులు చేసి అద్భుతమైన ఓపెనింగ్ ఇచ్చారు. ఆ వేంటనే 100 పరుగులు పూర్తి కావడంతో.. భారత్ ఖాతాలో విజయానికి అవకాశాలు పెరగడంతో పాటు అనేక రికార్డ్‌లు చేరాయి. అవేమిటంటే..
Updated on: Jul 24, 2023 | 7:04 AM

IND vs Wi 2nd Test: భారత ‘వెస్టిండీస్ పర్యటన’ టెస్టు క్రికెట్‌లో సరి కొత్త శకానికి నాంది పలికింది. అత్యంత ప్రత్యేకమైన ఓపెనింగ్ జోడీగా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ-యశస్వీ జైస్వాల్ నిలిచారు. కలిసి ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ అద్భుతమైన భాగస్వామ్యాలను నెలకొల్పారు. ముఖ్యంగా రెండో టెస్టులో టీమిండియా రెండో ఇన్నింగ్స్ సందర్భంగా ఈ జోడీ ‘ఇంగ్లాండ్ బజ్‌బాల్’ స్టైల్ కూడా షాక్ అయ్యేలా ఆడారు.

పోర్ట్ ఆఫ్ స్పెయిన్ టెస్టులో నాలుగో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ 8.33 రన్‌రేట్‌తో కేవలం 34 బంతుల్లోనే అర్ధ సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఇది టీమిండియా టెస్ట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన 50 భాగస్వామ్య రికార్డు.

అంతేనా..? 11.5 ఓవర్లు.. అంటే 71 బంతుల్లోనే 98 పరుగులు చేశారు. అయితే ఆ 71 బంతికి రోహిత్ వెనుదిరగడంతో.. 12.2 ఒవర్లకు టీమిండియా 100 పరుగుల మార్క్‌ని చేరింది. 12.2 ఓవర్లలోనే 100 పరుగులు చేసిన టీమిండియా.. 22 సంవత్సరాలుగా శ్రీలంక పేరిట ఉన్న రికార్డ్‌ని బద్దలు కొట్టింది. లంక 2001 లో బంగ్లాదేశ్‌పై 13.2 ఓవర్లలో 100 పరుగులు చేసింది.

శ్రీలంక రికార్డ్ కూడా బద్దలు కావడంతో.. టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100 పరుగుల మార్క్ అందుకున్న జట్టుగా భారత్ నిలిచింది. ఇది ‘బజ్‌బాల్ బ్యాటింగ్ స్టైల్’ అని చెప్పుకునే ఇంగ్లాండ్ టీమ్‌కి కూడా సాధ్యం కాని రికార్డు.

ఇదే కాదు.. ఈ సిరీస్‌లో భారత్ ఆడిన మూడు ఇన్నింగ్స్‌ల్లోనూ టీమిండియా ఓపెనర్లుగా వచ్చిన రోహిత్-యశస్వీ జోడీ.. 229, 139, 98 పరుగుల భాగస్వామ్యాలను అందించింది. ఇలా 3 ఇన్నింగ్స్‌ల్లోనూ మొత్తంగా 466 పరుగుల భాగస్వామ్యాన్ని ఈ జోడీ పంచుకుంది. విదేశాలలో భారత్‌కు ఇది ఓపెనింగ్ భాగస్వామ్యంగా కొత్త రికార్డు.

కాగా, భారత్ తన రెండో ఇన్నింగ్స్‌లో వేగంగా బ్యాటింగ్ చేసి కేవలం 24 ఓవర్లలో 181 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో భారత్ రన్ రేట్ 7.54. ఇది కూడా ఓ సరికొత్త రికార్డు. అంతకమందు పాకిస్థాన్‌పై టెస్ట్ ఇన్నింగ్స్‌లో 32 ఓవర్లకు 241 పరుగులు చేసిన ఆస్ట్రేలియా 7.53 రన్ రేట్‌తో ఈ రికార్డ్‌ని కలిగి ఉంది.





























