- Telugu News Photo Gallery Cricket photos IND vs WI 2nd Test: R Ashwin Surpassed Anil Kumble and Become 2nd highest ‘Indian’ wicket taker against West Indies
IND vs WI: అనిల్ కుంబ్లే రికార్డ్‌కి అశ్విన్ బ్రేక్.. భారత్ తరఫున రెండో ఆటగాడిగా మాజీ కెప్టెన్ల నడుమలోకి..
IND vs WI 2nd Test: వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆల్‌రౌండర్, వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ అరుదైన ఘనత సాధించాడు. ఈ క్రమంలో అనిల్ కుంబ్లే పేరిట ఉన్న ఓ అరుదైన రికార్డును తన సొంతం చేసుకుని, టీమిండియా దిగ్గజం కపిల్ దేవ్ తర్వాతి స్థానంలోకి చేరాడు. ఇంతకు అశ్విన్ సాధించిన ఆ ఘనత అదేమిటంటే..?
Updated on: Jul 24, 2023 | 8:42 AM

IND vs WI 2nd Test: పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరుగుతున్న రెండో టెస్ట్ నాల్గో రోజు ఆటలో అశ్విన్.. వెస్టిండీస్ ప్లేయర్లు క్రైగ్ బ్రెత్‌వైట్, కిర్క్ మెకంజీ వికెట్లను పడగొట్టాడు.

తద్వారా వెస్టిండీస్‌పై భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో ఆటగాడిగా అశ్విన్(75) అవతరించాడు. అంతక ముందు ఈ రికార్డ్ టీమిండియా మాజీ కెప్టెన్ అనిల్ కుంబ్లే(74) పేరిట ఉండేది.

కాగా, భారత్ తరఫున అత్యధిక విండీస్ వికెట్లు తీసిన ఆటగాడిగా 1983 వరల్డ్‌కప్ విన్నింగ్ టీమ్ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉంది. కపిల్ వెస్టిండీస్‌పై మొత్తం 89 వికెట్లు పడగొట్టాడు.

అశ్విన్ 75 వికెట్లతో రెండో స్థానంలో.. కుంబ్లే 74 వికెట్లతో మూడో స్థానంలో ఉన్నాడు. అంటే ఈ లిస్టులో టీమిండియా మాజీ కెప్లెన్ల నడుమకు అశ్విన్ చేరాడు.

వెస్టిండీస్‌పై అత్యధిక వికెట్లు తీసిన నాల్గో ఆటగాడిగా శ్రీనివాస వెంకటరాఘవన్ 68 వికెట్లతో ఉండగా.. ఐదో స్థానంలో 65 వెస్టిండీస్ వికెట్లు తీసిన భగ్వంత్ చంద్రశేఖర్ ఉన్నాడు.





























