Andhra Pradesh: జిల్లాల్లో పార్టీ పటిష్టతపై బీజేపీ ఫోకస్.. జోన్ల వారీగా కమలదళ నేతలకు పురంధేశ్వరి దిశానిర్దేశం..
Andhra Pradesh: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి జిల్లాల బాట పడుతున్నారు.రాష్ట్ర అధ్యక్షురాలిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పురందేశ్వరి పదిరోజుల పాటు పూర్తి స్థాయిలో పార్టీపై కసరత్తు చేశారు.రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఇతర పార్టీల బలాబలాలు అన్నీ బేరీజు..
Andhra Pradesh: భారతీయ జనతాపార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి జిల్లాల బాట పడుతున్నారు.రాష్ట్ర అధ్యక్షురాలిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన పురందేశ్వరి పదిరోజుల పాటు పూర్తి స్థాయిలో పార్టీపై కసరత్తు చేశారు.రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఇతర పార్టీల బలాబలాలు అన్నీ బేరీజు వేసుకున్నారు. బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న సహాయాన్ని,పధకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని పార్టీ నేతలకు సూచించారు. ఈ మేరకు నేటి నుంచి(జూలై 23) జిల్లా నాయకత్వం, అనుబంధ విభాగాలపై విస్తృత సమీక్షలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు పురందేశ్వరి. ఈ నెల 23 నుంచి 30 వరకూ నాలుగు జోన్లతో పాటు విజయవాడలో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ నెల 23న రాయలసీమ లో ఉమ్మడి నాలుగు జిల్లాల నేతలతో సమావేశం కానున్నారు 25న కోస్తా జోన్ సమావేశం గుంటూరులో జరగనుంది. ఈ నెల 26న రాజమండ్రి లో జరిగే ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల సమావేశంలో పురందేశ్వరి పాల్గొంటారు. 27న ఉత్తరాంధ్ర జోనల్ సమావేశం విశాఖలో జరగనుంది ఈ నెల 28న గాజువాక నియోజకవర్గం బూత్ ప్రెసిడెంట్ లతో పురంధేశ్వరి సమావేశం కానున్నారు ఈ నెల 25 న,30 వ తేదీల్లో విజయవాడలో అనుబంధ విభాగాలు,మోర్చాల నాయకులతో పురంధేశ్వరి భేటీ కానున్నారు.ఈ సమావేశాల్లో జిల్లాల నేతలకు పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. జిల్లాలవారీగా పార్టీ పరిస్థితి, స్థానికంగా బలాబలాలు పై నేతలతో చర్చించి పలు సూచనలు చేయనున్నారు
సొంతంగా ఎదగడంపై పురంధేశ్వరి ఫోకస్
ఇకపై సొంతబలంపైనే ఆధారపడి రాజకీయం చేస్తామని ఇప్పటికే పురంధేశ్వరి ప్రకటించారు. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో పార్టీ పరిస్థితి అంత మెరుగ్గా లేదు. ప్రభుత్వంపై అప్పుడప్పుడూ ఉద్యమాలు చేసినా..పెద్దగా బల పడింది లేదు. దీంతో ఈ పరిస్థితి మార్చాలని పురంధేశ్వరి నిర్ణయించారు. జిల్లాల వారీగా పార్టీ బలం పుంజుకునే అవకాశాలు ఉన్నప్పటికీ నాయకత్వ లోపం ఉందని గమనించారు. దీంతో జిల్లాల పర్యటనలో కీలక నిర్ణయాలు తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరు వరకూ జిల్లాల పర్యటనలు పూర్తి చేసి ఆగస్ట్ నుంచి కేడర్‌ను పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా ఏపీ బీజేపీ చీఫ్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..