Watch Video: నడి రోడ్డుపై ఎద్దుల కుమ్ములాట.. కాసేపు భీకర యుద్ధమే సాగింది..
అనంతపురం పట్టణంలో నడిరోడ్డుపై రెండు ఎద్దులు కుమ్ములాడుకున్నాయి. పోట్ల గిత్తల మాదిరి ఒకదానికొకటి పోట్లాడుకున్నాయి. పట్టణంలోని రామ్ నగర్ ఫ్లైఓవర్ దగ్గర నడిరోడ్డు మీద ఎద్దులు కుమ్ములాడుకుంటున్న దృశ్యాలను ఒక వ్యక్తి రికార్డ్ చేశాడు. దాదాపు పది నిమిషాల పాటు ఆ పోట్ల గిత్తలు అలాగే కుమ్ములాడుకున్నాయి.
అనంతపురం పట్టణంలో నడిరోడ్డుపై రెండు ఎద్దులు కుమ్ములాడుకున్నాయి. పోట్ల గిత్తల మాదిరి ఒకదానికొకటి పోట్లాడుకున్నాయి. పట్టణంలోని రామ్ నగర్ ఫ్లైఓవర్ దగ్గర నడిరోడ్డు మీద ఎద్దులు కుమ్ములాడుకుంటున్న దృశ్యాలను ఒక వ్యక్తి రికార్డ్ చేశాడు. దాదాపు పది నిమిషాల పాటు ఆ పోట్ల గిత్తలు అలాగే కుమ్ములాడుకున్నాయి. చుట్టుపక్కల జనం ఎంత గద్దించినప్పటికీ అవి ఆగలేదు. ఆఖరికి స్థానికులు కర్రలతో వాటిని భయపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ ఏమాత్రం తగ్గలేదు. అలా ఒకదానికొకటి కొమ్ములతో పొడుచుకుంటూ జనం మీదికి దూసుకెళ్లాయి ఆ పోట్ల గిత్తలు. దీంతో పలు వాహనాలు ధ్వంసం అవ్వడంతో పాటు. నలుగురికి గాయాలయ్యాయి. నడిరోడ్డుపై రెండు ఎద్దులు కుమ్ములాడుకోవడంతో ఆ దారిలో వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నడిరోడ్డుపై ఎద్దుల కుమ్ములాట వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..