IND vs WI 2nd Test: గాల్లోకి దూకి ఒంటి చేత్తో కళ్ళు చెదిరే క్యాచ్.. రహానే మెరుపు వేగం చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..

IND vs WI 2nd Test: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న భారత్-వెస్టిండీస్ రెండో టెస్టు బౌలర్ల పోరాట కథగా మారింది. పిచ్, స్థానిక పరిస్థితులు బౌలర్ల ప్రభావానికి ఆటంకంగా మారింది. మొదటి టెస్టులో 150, 120 పరుగులకే కుప్పకూలిన విండీస్ టీమ్ రెండో మ్యాచ్‌లో భారత్‌కి ధీటైన..

IND vs WI 2nd Test: గాల్లోకి దూకి ఒంటి చేత్తో కళ్ళు చెదిరే క్యాచ్.. రహానే మెరుపు వేగం చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
Rahane Catch; IND vs WI 2nd Test
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jul 23, 2023 | 7:32 AM

IND vs WI 2nd Test: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా జరుగుతున్న భారత్-వెస్టిండీస్ రెండో టెస్టు బౌలర్ల పోరాట కథగా మారింది. పిచ్, స్థానిక పరిస్థితులు బౌలర్ల ప్రభావానికి ఆటంకంగా మారింది. మొదటి టెస్టులో 150, 120 పరుగులకే కుప్పకూలిన విండీస్ టీమ్ రెండో మ్యాచ్‌లో భారత్‌కి ధీటైన సమాధానమిస్తోంది. దీంతో వికెట్ తీయడం బౌలర్లకు కష్టమే అన్నట్లుగా పరిస్థితి మారింది. అయితే అలా అనుకుంటున్న సమయంలోనే టీమిండియా వైస్ కెప్టెన్ అజింక్యా రహానే మెరుపు క్యాచ్ పట్టి జెర్మైన్‌ బ్లాక్‌వుడ్‌(20) పెవిలియన్‌కి పంపాడు. జడేజా బౌలింగ్‌లో స్లిప్‌లో ఉన్న రహానే ఆ క్యాచ్‌ని ఎంత వేగంగా, షార్ప్‌గా పట్టుకున్నాడంటే.. బంతి తమ వైపు వస్తుందన్న ఆలోచన రాకముందే క్యాచ్ కోసం ముందుకు దూకాడా అన్నట్లుగా ఉంది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అయితే ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో ఆకట్టుకున్న రహానే విండీస్‌తో రెండు టెస్టుల్లోనూ పూర్తిగా విఫలమయ్యాడు. తొలి టెస్టులో 3 పరుగులకే పెవిలియన్ చేరిన అతను.. రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 8 పరుగులకే పరిమితమయ్యాడు. మరోవైపు రెండో టెస్ట్ మూడో రోజు ఆట ప్రారంభానికి ముందు ఒక వికెట్ నష్టానికి 86  పరుగులు చేసిన విండీస్ 3వ రోజు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది. అంటే విండీస్ ప్లేయర్లు పరుగులు తీయడానికి, అలాగే భారత బైలర్లు వికెట్లు తీసేందుకు కూడా కొంచెం క్లిష్టపరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

కాగా, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 438 పరుగులు చేయగా.. మూడో రోజు ఆట ముగిసే సరికి విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 5 వికెట్ల నష్టానికి 229  పరుగులు చేశారు. అంటే విండీస్ ఇంకా 209 పరుగులు వెనుకంజలోనే ఉంది. ఇదిలా ఉండగా రెండు రోజులే మిగిలి ఉన్న రెండో టెస్టులో భారత్ విజయం సాధించాలంటే విండీస్‌ని వెంటనే ఆల్‌ఔట్ చేసి భారత్ బ్యాటింగ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలి. కనీసం 250 టార్గెట్ ఉండేలా ఇన్నింగ్స్ డిక్లేర్ చేసి.. ఆ వెంటనే కూడా విండీస్ ప్లేయర్లను ఆలౌట్ చేయాలి. ఇదంతా జరగడం అసాధ్యమే అనిపించినా భారత్ బౌలర్లు విజృంభిస్తే సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయి.

మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం