AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: టమాట సాగుతో 90 లక్షలు సంపాదించిన రైతు.. అదును చూసి ఆధునిక పద్థతితో లాభాలు..

Medak District: టమాటాలకు సరైన ధరలేక రోడ్డు పక్కన పారబోసి, మద్దతు ధర లేదని పొలాల్లోనే పంటను దున్నేసిన రోజులు చూసాం.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.. ఇప్పుడు టమాటాలన కలిగిన వ్యక్తికి డబ్బులే డబ్బులు.. ఎందుకు అంటే టమాటాకు అంత

Telangana: టమాట సాగుతో 90 లక్షలు సంపాదించిన రైతు.. అదును చూసి ఆధునిక పద్థతితో లాభాలు..
Mahipal Reddy, Tomato farmer
P Shivteja
| Edited By: Ravi Kiran|

Updated on: Jul 22, 2023 | 10:39 AM

Share

మెదక్ జిల్లా న్యూస్, జూలై 21: టమాటాలకు సరైన ధరలేక రోడ్డు పక్కన పారబోసి, మద్దతు ధర లేదని పొలాల్లోనే పంటను దున్నేసిన రోజులు చూసాం.. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.. ఇప్పుడు టమాటాలన కలిగిన వ్యక్తికి డబ్బులే డబ్బులు.. ఎందుకు అంటే టమాటాకు అంత డిమాండ్ ఉంది మార్కెట్‌లో.. ఆ డిమాండ్‌ను గుర్తించి టమాటా సాగు చేసి అందులో సక్సెస్ అయ్యి 90 లక్షల రూపాయలు సంపాదించారు ఓ రైతు.. ఇది ఎక్కడో ఇతర రాష్ట్రాల్లో అనుకంటే మీరు పప్పులో కాలేసినట్లే.. సదరు రైతు మన తెలంగాణ రాష్ట్రానికి చెందినవారే.. మీరు చదివింది నిజమేనండి.. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్ నగర్‌కి చెందిన రైతు మహిపాల్ రెడ్డి.. పదో తరగతి ఫెయిల్ అయిన ఈ రైతు.. టమాటా సాగు చేసి ఇప్పటివరకు 90 లక్షల రూపాయలు సంపాదించారు.

ఆయన మొదటి నుంచి ఎక్కువగా కూరగాయల సాగే చేసేవారు.. అయితే టమాటా పంటను ఎక్కువగా మన రాష్ట్రాల వారు మే, జూన్, జులైలో ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటారు. .దీన్ని గుర్తించిన మహిపాల్ రెడ్డి ఏప్రిల్‌లో టమాటా సాగు ప్రారంభించారు. ఈ సమయంలో మన రాష్ట్రాల్లో వేడి బాగా ఉంటుంది కాబట్టి సాగు ఎక్కువ రాదు అని చాలా మంది సాగు చేయరు అందుకే టమాటాకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది అని గమనించి, దానికి అనుగుణంగా సాగు చేసి లక్షల రూపాయలు గడించారు.. నూతన, ఆధునిక వ్యవసాయం పద్దతిలో ఈ టమాటా సాగు చేసారు.

మొత్తం 9 ఎకరాల్లో టమాటా సాగు చేస్తే.. ఎకరాకు 2 లక్షల పెట్టుబడి ఖర్చు వచ్చింది.. ఇక ఎకరాకు పది లక్షల లాభం వచ్చింది.. అంటే 9 ఎకరాలకు 90 లక్షల లాభం వచ్చింది.. ఇంకా తోటలో టమాటా ఉంది. ఇది మొత్తం అయిపోయే సరికి మహిపాల్ రెడ్డి కోటి రూపాయలు సంపాదించే అవకాశం లేకపోలేదు..టమాటాపై కోటి రూపాయలు వస్తుండం తో మహిపాల్ రెడ్డిని చూసి మిగతా రైతులు అవాక్కయతున్నారట.