Rinku Singh: కోహ్లీ, ధోని కాదు.. ‘అతనే కింగ్, నాకు ఆదర్శం’.. మిస్టర్ ఐపీఎల్‌పై రింకూ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
Rinku Singh: జాతీయ జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్‌కి బీసీసీఐ పిలుపునిచ్చింది. దీంతో ఐపీఎల్ 16వ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున మెరుపులు మెరిపించిన ఈ యువ ఆటగాడి కల నెరవేరింది. ఈ మేరకు త్వరలో చైనాలోని..
Rinku Singh: జాతీయ జట్టులో అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఐపీఎల్ స్టార్ రింకూ సింగ్‌కి బీసీసీఐ పిలుపునిచ్చింది. దీంతో ఐపీఎల్ 16వ సీజన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున మెరుపులు మెరిపించిన ఈ యువ ఆటగాడి కల నెరవేరింది. ఈ మేరకు త్వరలో చైనాలోని హాంగ్‌జౌ వేదికగా జరిగే ఆసియా క్రీడల్లో రింకూ కనిపించనున్నాడు. అయితే రింకూ సింగ్ ఇటీవల తాను పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో టీమిండియా మాజీ ప్లేయర్ సురేష్ రైనానే ఐపీఎల్ కింగ్ అని, తనకు అతనే స్ఫూర్తి అని పేర్కొన్నాడు.
RevSportz నిర్వహించిన ఇంటర్వ్యూలో రింకూ మాట్లాడుతూ ‘నాకు సురేష్ రైనా స్ఫూర్తి. తనతో నేను ఎప్పుడూ కంటాక్ట్‌లో ఉంటా. ఐపీఎల్ కింగ్ అతను, నాకు ఎప్పుడూ సలహాలు ఇస్తుంటాడు. హర్భజన్ సింగ్ కూడా నా కెరీర్‌లో చాలా సహకరించారు. వారి సహాయసహకారానికి నేను కృతజ్ఞుడిని. అలాంటి పెద్ద ప్లేయర్లు మన గురించి మాట్లాడితే అది ఎంతో స్ఫూర్తినిస్తుంద’ని చెప్పుకొచ్చాడు.
కాగా, రింకూ ఇటీవల జరిగిన ఐపీఎల్‌లో కేకేఆర్ తరఫున మొత్తం 474 పరుగులు చేసి.. సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన టాప్ 10 లిస్టులో నిలిచాడు. ఈ ప్రదర్శనతోనే రింకూ ఆసియా క్రీడలకు వెళ్లే భారత్ జట్టులో అవకాశం దక్కించుకున్నాడు.
ఆసియా క్రీడల కోసం భారత్ జట్టు: రుతురాజ్ గైక్వాడ్(కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రాహుల్ త్రిపాఠి, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, షాహజ్ అహ్మద్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, అర్ష్‌దీప్ సింగ్, ముకేష్ కుమార్, శివమ్ మావి, శివమ్ దుబే, ప్రభ్‌మాన్ సింగ్(వికెట్ కీపర్)
స్టాండ్‌బై ఆటగాళ్లు: యష్ ఠాకూర్, సాయి కిషోర్, వెంకటేష్ అయ్యర్, దీపక్ హుడా, సాయి సుదర్శన్.