AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ఆయనకు 76.. ఆమెకు 47.. వయసుదేముంది బాస్ జస్ట్ నంబరే.. ఇద్దరు కలిసి ఏం చేశారో తెలుసా..?

వయసుదేముంది బాస్ జస్ట్ నంబర్ మాత్రమే.. ఆమెకు 47.. ఆయనకు 76.. లేటు వయస్సులో ఘాటైన ప్రేమ చిగురించింది.. ఇంకేముంది ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. రెండు మనస్సులు కలిస్తే చాలని వీరద్దరూ..

Viral: ఆయనకు 76.. ఆమెకు 47.. వయసుదేముంది బాస్ జస్ట్ నంబరే.. ఇద్దరు కలిసి ఏం చేశారో తెలుసా..?
The Unique Love Marriage
Shaik Madar Saheb
|

Updated on: Jul 28, 2023 | 10:00 AM

Share

వయసుదేముంది బాస్ జస్ట్ నంబర్ మాత్రమే.. ఆమెకు 47.. ఆయనకు 76.. లేటు వయస్సులో ఘాటైన ప్రేమ చిగురించింది.. ఇంకేముంది ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. రెండు మనస్సులు కలిస్తే చాలని వీరద్దరూ మరోసారి రుజువుచేశారు. ఎనిమిదేళ్లుగా ప్రేమించుకుంటూ.. చివరకు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. 76 ఏళ్ల వయస్సులో.. 47 వయస్సున్న మహిళతో ప్రేమలో పడ్డ ఓ వృద్ధుడు తాజాగా పెళ్లి చేసుకుని వైరల్ గా మారాడు. లేటు వయసులో చిగురించిన ఈ ప్రేమ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లా శంఖేముండి మండలం అడ్డాడ గ్రామంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..

గ్రామానికి చెందిన రామచంద్ర సాహు (76) అనే వృద్ధుడికి చాలా ఏళ్ల క్రితం వివాహమైంది. తన ఇద్దరు కూతుళ్లకు పెళ్లి కూడా చేశాడు. ఈ క్రమంలో భార్య మరణించింది. దీంతో దాదాపు 18 ఏళ్ల నుంచి ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈ క్రమంలో మళ్లీ పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగింది. అయితే.. దాని కోసం ప్రయత్నాలు మొదులుపెట్టిన క్రమంలో.. ఎనిమిదేళ్ల క్రితం భంజ్‌నగర్‌ కులాగర్‌ గ్రామానికి చెందిన త్రినాథ్‌ సాహు కుమార్తె సురేఖ (46) ను ఒకసారి చూశాడు.

అయితే, అలా చూసిన తొలిచూపులోనే ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ప్రేమలో పడ్డానని.. పెళ్లిచేసుకుంటానని రామచంద్ర చెప్పిన మాటలకు సురేఖ కూడా అంగీకరించింది. కొన్నాళ్లు ఇద్దరూ ఫోన్‌లో మాట్లాడుకుంటూ కాలం వెళ్లదీశారు.

ఇవి కూడా చదవండి

చివరకు జులై 19న భంజ్‌నగర్‌ కోర్టులో రామచంద్ర, సురేఖ వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆలయంలో ఆచారాల ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకున్నారు. ఈ వయసులో తమ ప్రేమ పెళ్లిని అడ్డుకోకుండా.. కుటుంబ సభ్యులు పెద్ద మనసుతో ఆలోచించాలని ఇద్దరూ పేర్కొన్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం..

పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
పనికిరావని పారేస్తున్నారా? ఈ గింజలే ఆరోగ్యానికి శ్రీరామరక్ష!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
భూగర్భంలో అతిపెద్ద బంగారు నిధి.. 3400 టన్నుల గోల్డ్‌ గుర్తింపు!
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
అప్పుడెప్పుడో మాయం అయ్యింది.. ఇప్పుడు మెగాస్టార్ మూవీతో ఛాన్స్..
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
నారింజ పండ్ల తొక్కలు పడేస్తున్నారా? మీరీ విషయం తెలుసుకోవాల్సిందే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
దుర్వాసనను స్పాంజ్‌లా పీల్చేస్తుంది.. యాపిల్ చేసే మ్యాజిక్ ఇదే
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
గంగవ్వ శతాయుష్కురాలు.. 101 పడిలోకి అడుగు
ఇంట్లో ఎలుకలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా తరిమికొట్టండి!
ఇంట్లో ఎలుకలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా? ఇలా తరిమికొట్టండి!
న్యాయం, ధర్మం, ఖాకీ బుక్ అందరికీ ఒకేలా ఉండాలిః కేటీఆర్
న్యాయం, ధర్మం, ఖాకీ బుక్ అందరికీ ఒకేలా ఉండాలిః కేటీఆర్
క్యాబేజీ వీరికి యమ డేంజర్‌.. తిన్నారో నేరుగా కైలాసానికే!
క్యాబేజీ వీరికి యమ డేంజర్‌.. తిన్నారో నేరుగా కైలాసానికే!
జెట్ స్పీడ్‌లో గోపీచంద్ నయ మూవీ షూటింగ్..
జెట్ స్పీడ్‌లో గోపీచంద్ నయ మూవీ షూటింగ్..