Viral Video: ఈ పంది అద్భుతమైన పెయింటర్.. బొమ్మ విలువ లక్షల్లోనే.. ఇప్పటి వరకూ ఎంత సంపాదించిందో తెలిస్తే షాక్..

పెయింటింగ్స్ వేస్తోన్న జంతువు నిజానికి 'పిగ్కాసో' అనే పంది. ఈ పంది ఇప్పుడు పెయింటింగ్స్ వేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. పందులను మనదేశంలో సాధారణంగా చాలామంది అసహ్యకరమైన జంతువులుగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇవి తరచుగా బురద, దుమ్ము ధూళి ప్రాంతాల్లో కనిపిస్తాయి.

Viral Video: ఈ పంది అద్భుతమైన పెయింటర్.. బొమ్మ విలువ లక్షల్లోనే.. ఇప్పటి వరకూ ఎంత సంపాదించిందో తెలిస్తే షాక్..
Artist Pig Pigcasso
Follow us
Surya Kala

|

Updated on: Jul 27, 2023 | 9:31 AM

అరవై నాలుగు కళల్లో ఒకటి చిత్ర కళ. కళ్లకు కనిపించిన అందాలను మనసులో పదిల పరిచి.. దానిని కాన్వాస్ మీద చిత్రీకరించే కళాకారులు ప్రపంచంలో అనేక మంది ఉన్నారు.  అయితే కొంతమంది చేసిన పెయింటింగ్స్ ను ఇష్టపడి మరీ లక్షలు పెట్టి మరీ కొనుగోలు చేస్తారు. అయితే కొందరు వేసే బొమ్మలు ఏకంగా కోట్లు ఖరీదు పెట్టిమరీ కొనుగోలు చేస్తారు. అందుకే ఆ పెయింటింగ్స్ చాలా ప్రత్యేకమైనవని.. వాటి విలువ అందరికీ అర్థం కాదని అంటారు. పెయింటింగ్ భాషని అర్థం చేసుకున్న వారికి మాత్రమే వాటి విలువ అర్ధం అవుతుందని అందుకే ఆ పెయింటింగ్‌లకు అంత భారీ ధర చెల్లిస్తారని పేర్కొంటారు కొందరు. అయితే కొందరు మాత్రం ఎంత గొప్ప బొమ్మలు అయితే మాత్రం.. వీటికి ఇంత ధర చెల్లించాల్సిన అవసరం ఉందా అంటూ పెదవి విరుస్తారు కూడా..అంతేకాదు సామాన్యుడు వాటి ధర విని షాక్ ఫీల్ అవుతాడు. ఇదంతా సరే.. మనుషులు వేసిన పెయింటింగ్స్ ను ఇప్పటివరకూ ఎన్నో చూసి ఉంటారు కానీ.. అయితే కాన్వాస్ మీద జంతువులు వేసిన పెయింటింగ్ ఎప్పుడైనా చూసారా.. అంతేకాదు మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ పెయింటింగ్ కూడా లక్షలు, కోట్లలో అమ్ముడవుతోంది.

పెయింటింగ్స్ వేస్తోన్న జంతువు నిజానికి ‘పిగ్కాసో’ అనే పంది. ఈ పంది ఇప్పుడు పెయింటింగ్స్ వేయడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. పందులను మనదేశంలో సాధారణంగా చాలామంది అసహ్యకరమైన జంతువులుగా పరిగణిస్తారు. ఎందుకంటే ఇవి తరచుగా బురద, దుమ్ము ధూళి ప్రాంతాల్లో కనిపిస్తాయి. అయితే కొన్ని దేశాల్లో కొన్ని రకాల పందులను ముద్దుగా పెంచుకుంటారు కూడా.. అయితే ఒక పంది..పెయింటింగ్ వేస్తూ వార్తల్లో నిలుస్తోంది.

ఇవి కూడా చదవండి

పెయింటింగ్ వేస్తున్న పంది వీడియోను చూడండి

View this post on Instagram

A post shared by Pigcasso (@pigcassohoghero)

డైలీ స్టార్ నివేదిక ప్రకారం దక్షిణాఫ్రికా నివాసి జోవాన్ లెఫ్సన్ అనే కళాకారుడు ఈ పందిని పెంచుకుంటున్నారు. 50 ఏళ్ల జోవాన్ కు ఈ పందితో 7 సంవత్సరాల క్రితం అంటే 2016 సంవత్సరంలో మొదటిసారి పరిచయం అయింది. పంది ప్రాణాపాయంలో ఉన్న సమయంలో జోవాన్ లెఫ్సన్ కంట పడింది. ఒక స్లాటర్‌హౌస్‌లో ఉన్న సమయంలో ప్రాణాపాయం సమయంలో పందిని జోవాన్ లెఫ్సన్ రక్షించి తనతో తీసుకువచ్చాడు. పిగ్కాసో అనే పేరు పెట్టారు. అప్పటి నుంచి జోవాన్ లెఫ్సన్ తోనే పంది జీవిస్తోంది. జోవాన్ పెయింటింగ్ బ్రష్‌తో పెయింటింగ్స్ వేయడం చూసిన పిగ్కాసో తాను కూడా బ్రష్ పట్టుకుంది. పెయింటింగ్ వేయడం ప్రారంభించింది.

విచిత్రమైన పెయింటింగ్స్ వేస్తున్న పిగ్కాసో ఒకసారి తన పెయింటింగ్ బ్రష్ రంగుల బాక్స్ లో ఉందని.. అప్పుడు ఆ బ్రష్ ను తీసుకుని పిగ్కాసో ఆదుకోవడం చూశానని జోవాన్ చెప్పారు. అప్పుడు తన పిగ్కాసోకి పెయింటింగ్ అంటే చాలా ఇష్టం అని భావించి, మార్కెట్ నుండి దాని కోసం ఒక కాన్వాస్ కొని ఇచ్చినట్లు పేర్కొన్నాడు. తన కాన్వాస్ పై సొంతంగా బొమ్మలు వేయడం మొదలు పెట్టింది. అయితే పందికి తాను వేస్తున్న పెయింటింగ్‌ ఏమిటో అర్థం లేకపోయినా.. వాటిని ప్రజలు అమితంగా ఇష్టపడుతున్నారు.

కోట్ల విలువైన పెయింటింగ్స్‌ వేస్తోన్న పిగ్కాసో నివేదికల ప్రకారం పిగ్కాసో వేసిన పెయింటింగ్ రూ. 20 లక్షలకు పైగా అమ్ముడైంది. ఆ పంది వేసిన  పెయింటింగ్ ను జోవాన్ లెఫ్సన్  వెంటనే సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. దీంతో ఆ పెయింటింగ్స్ ను  కొనుగోలుదారులు ఎగబడి కొనడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. పిగ్‌కాసో ఇప్పటివరకు 400కు పైగా పెయింటింగ్స్‌ను రూపొందించింది. దీని మొత్తం విలువ రూ. 10 కోట్లకు పైగా ఉంటుందని అంచనా.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి..