AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: అదిరిపోయే అరంగేట్రం.. తొలి మ్యాచ్‌లోనే తెలుగబ్బాయ్ రికార్డుల పర్వం.. కళ్లు చెదిరే క్యాచ్‌లతో స్పెషల్ జాబితాలో చోటు..

Tilak Varma Diving Catch: వెస్టిండీస్‌ టూర్‌లో యువ ఆటగాళ్లకు టీమ్‌ఇండియాలో వరుసగా అవకాశాలు లభిస్తున్నాయి. టెస్టు, వన్డే సిరీస్‌ల తర్వాత టీ20 సిరీస్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. తొలి వన్డేలోనే యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మకు అవకాశం కల్పించారు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో తన ప్రదర్శనతో ప్రభావం చూపిన తిలక్ వర్మను టీమిండియా మొదటిసారి స్వ్కాడ్‌లో చేర్చి, తొలి మ్యాచ్‌లోనే అవకాశం అందించింది. అయితే బ్యాటింగ్ చేయడానికి ముందు, తిలక్ వర్మ తన బలమైన ఫీల్డింగ్‌తో మ్యాచ్‌లో ప్రభావం చూపాడు.

Video: అదిరిపోయే అరంగేట్రం.. తొలి మ్యాచ్‌లోనే తెలుగబ్బాయ్ రికార్డుల పర్వం.. కళ్లు చెదిరే క్యాచ్‌లతో స్పెషల్ జాబితాలో చోటు..
Tilak Varma Stunning Catch
Venkata Chari
|

Updated on: Aug 04, 2023 | 5:00 AM

Share

Tilak Varma Debut Match: వెస్టిండీస్‌ టూర్‌లో యువ ఆటగాళ్లకు టీమ్‌ఇండియాలో వరుసగా అవకాశాలు లభిస్తున్నాయి. టెస్టు, వన్డే సిరీస్‌ల తర్వాత టీ20 సిరీస్‌లోనూ ఇదే ట్రెండ్ కొనసాగుతుంది. తొలి వన్డేలోనే యువ బ్యాట్స్‌మెన్ తిలక్ వర్మకు అవకాశం కల్పించారు. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో తన ప్రదర్శనతో ప్రభావం చూపిన తిలక్ వర్మను టీమిండియా మొదటిసారి స్వ్కాడ్‌లో చేర్చి, తొలి మ్యాచ్‌లోనే అవకాశం అందించింది. అయితే బ్యాటింగ్ చేయడానికి ముందు, తిలక్ వర్మ తన బలమైన ఫీల్డింగ్‌తో మ్యాచ్‌లో ప్రభావం చూపాడు. ఇది వెస్టిండీస్ భారీ స్కోరు చేయకుండా నిరోధించడంలో సహాయపడింది. ఇది మాత్రమే కాదు, ఈ క్రమంలో సురేష్ రైనా ప్రత్యేక రికార్డును కూడా తిలక్ సమం చేయడం విశేషం.

ట్రినిడాడ్‌లో భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో 20 ఏళ్ల తిలక్ వర్మకు అరంగేట్రం చేసే అవకాశం లభించింది. ఇది ఊహించినదే. కెప్టెన్ హార్దిక్ పాండ్యా అతనికి టీమిండియా క్యాప్ అందించాడు. టీమ్ ఇండియా తొలి బౌలింగ్ కారణంగా బ్యాటింగ్‌లో సత్తా చాటేందుకు ఎదురుచూడాల్సి వచ్చింది. అయితే, ఫీల్డింగ్‌లో అద్భుతమైన క్యాచ్ పట్టి మ్యాచ్‌లో తన సత్తా చాటాడు.

ఇవి కూడా చదవండి

కళ్లు చెదిరే క్యాచ్..

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌లో తిలక్‌ వర్మకు ఈ అవకాశం లభించింది. ఇది కుల్దీప్ యాదవ్ వేసిన తొలి ఓవర్ కాగా, మూడో బంతికి జాన్సన్ చార్లెస్ గాలిలో భారీ షాట్ ఆడాడు. ఈ క్యాచ్ లాంగ్ ఆన్, మిడ్ వికెట్ మధ్య వెళ్లింది. ఇలాంటి పరిస్థితిలో డీప్ మిడ్ వికెట్ వద్ద పోస్ట్ చేసిన తిలక్ వర్మ, దాదాపు 20-25 మీటర్ల దూరం పరుగెత్తాడు. ఆపై లాంగ్ డైవ్ చేసి ఆశ్చర్యకరమైన క్యాచ్ పట్టాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తిలక్ వర్మకు ఇదే తొలి క్యాచ్.

రైనా రికార్డును సమం..

తిలక్ ఇక్కడితో ఆగలేదు. కొద్దిసేపటికే మరో క్యాచ్‌ పట్టే అవకాశం లభించినా నిరాశ చెందలేదు. ఈసారి వికెట్ చాలా పెద్దది. భారత బౌలర్లపై విరుచుకుపడుతున్న నికోలస్ పూరన్.. హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో పుల్ షాట్ ఆడాడు. కానీ, టైమింగ్ సరిగా లేకపోవడంతో డీప్ మిడ్ వికెట్ వద్ద తిలక్ వర్మ అద్భుతమైన క్యాచ్ అందుకున్నాడు. ఈసారి క్యాచ్ సులువుగా తిలక్ వర్మ క్యాచ్ పట్టాడు. ఈ విధంగా సురేష్ రైనా భారత రికార్డును తిలక్ వర్మ సమం చేశాడు. రైనాలాగే తిలక్ కూడా టీ20 అరంగేట్రంలో రెండు క్యాచ్‌లు పట్టడంలో సఫలమయ్యాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్
ఏంటన్నా ఇలా మారిపోయావ్.. హీరోగా టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
తిరుమలకు వెళ్లే ఆ నడక మార్గం మూసివేత!
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
రిచా ఘోష్ ఆన్ డ్యూటీ.. జీతం, బోనస్ కలిపి ఎంతోస్తాయో తెలుసా ?
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు