AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World’s Richest Woman: అంబానీ, ఆదానీ కాదు..ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు ఈ సుందరి.. ఆమె ఆస్తి ఎంతో తెలిస్తే..

అంబానీ, అదానీ, ఎలాన్ మస్క్ బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కానీ, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా..? వరల్డ్‌ టాప్‌ బిలియనీర్ల టాప్ లిస్టులో ఉన్నవారు ఓ మహిళ అని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రపంచ కుబేరుల స్థానంలో అగ్రస్థానంలో ఉన్న ఈ సుందరి ఎవరంటే. భారతదేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ నికర విలువ దాదాపు $91 బిలియన్లు అయితే ఈ మహరాణి సంపద బిలియన్లలో కాదు ట్రిలియన్లలో ఉంది. ఇది దాదాపు 16 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.

World's Richest Woman: అంబానీ, ఆదానీ కాదు..ప్రపంచంలోనే అత్యంత సంపన్నురాలు ఈ సుందరి.. ఆమె ఆస్తి ఎంతో తెలిస్తే..
Worlds Richest Woman
Jyothi Gadda
|

Updated on: Aug 04, 2023 | 7:48 AM

Share

ప్రపంచంలో అత్యంత ధనవంతులు ఎవరనే విషయానికి వస్తే.. పెద్ద కంపెనీలు, ఖరీదైన వస్తువులను కలిగి ఉన్న, విలాసవంతమైన జీవితాలను గడిపే వ్యక్తుల గురించి చర్చించుకుంటాం..ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడు ఎలాన్ మస్క్, అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్, భారతదేశం అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ, అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ తదితరుల పేర్లు వెంటనే గుర్తుకు వస్తాయి. అయితే ఈ చైనీస్ మహిళ అందరికంటే ధనవంతురాలు. అంబానీ, అదానీ, ఎలాన్ మస్క్ బిలియనీర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నారు. కానీ, ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎవరో తెలుసా..?

వరల్డ్‌ టాప్‌ బిలియనీర్ల టాప్ లిస్టులో ఉన్నవారు ఓ మహిళ అని తెలిస్తే ఆశ్చర్యపోతారు. ప్రపంచ కుబేరుల స్థానంలో అగ్రస్థానంలో ఉన్న ఈ సుందరి ఎవరంటే. భారతదేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ నికర విలువ దాదాపు $91 బిలియన్లు అయితే ఈ మహరాణి సంపద బిలియన్లలో కాదు ట్రిలియన్లలో ఉంది. ఇది దాదాపు 16 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.

అనేక నివేదికల ప్రకారం, చైనాకు చెందిన ఎంప్రెస్ వు భూమిపై నివసిస్తున్న అత్యంత సంపన్న మహిళ. ఆమె నికర విలువ USD 16 ట్రిలియన్లుగా అంచనా వేయబడింది. ఇది ఎలాన్ మస్క్, ముఖేష్ అంబానీ, జెఫ్ బెజోస్ తదితరుల నికర విలువ కంటే ఎక్కువ. వు ఎంప్రెస్ టాంగ్ రాజవంశానికి చెందినది. ఆమె చరిత్రలో అత్యంత ధనిక మహిళా రాణి. చైనాకు చెందిన ఎంప్రెస్ వు (వు జెటియన్) ఇప్పటివరకు జీవించిన అత్యంత అందమైన మహిళల్లో ఒకరు. చైనీస్ చరిత్రలో ఆమె మొదటి, ఏకైక మహిళా చక్రవర్తి. ఆ పదవి కోసం తన పిల్లలను కూడా చంపిన చరిత్ర ఉంది. టాంగ్ రాజవంశానికి చెందిన ఎంప్రెస్ వు చరిత్రలో అత్యంత ధనిక మహిళా చక్రవర్తిగా పేరు గాంచింది.

ఇవి కూడా చదవండి

చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, వు ఎంప్రెస్ చాలా మోసపూరిత, క్రూరమైన వ్యక్తి. అధికారంలో ఉండేందుకు సామ్రాజ్ఞి వు తన పిల్లలను కూడా చంపేశారని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. ఎంప్రెస్ వు ఉన్నత విద్యావంతురాలు, ఆమె చమత్కారమైన జీవిత కథపై అనేక సినిమాలు, సీరియల్లు కూడా వచ్చాయి. ఫ్యాన్ బింగ్‌బింగ్ నటించిన ఎంప్రెస్ ఆఫ్ చైనా అటువంటి టీవీ సిరీస్. వు సామ్రాజ్ఞి సుమారు 15 సంవత్సరాలు పాలించింది. మధ్య ఆసియాలో చైనా సామ్రాజ్యాన్ని విస్తరించడంలో కీలక పాత్ర పోషించింది. ఆమె హయాంలో, టీ, సిల్క్ వ్యాపారంతో చైనా ఆర్థిక వ్యవస్థ గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందని చైనా ప్రాజెక్ట్ నివేదించింది. మరణానంతరం, ఎంప్రెస్ వుకు వివిధ అధికారిక బిరుదులు లభించాయి.

ఎలోన్ మస్క్ నికర విలువ దాదాపు $235 బిలియన్లు కాగా, జెఫ్ బెజోస్ నికర విలువ $150 బిలియన్లు. భారతదేశపు అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ నికర విలువ దాదాపు $91 బిలియన్లు అయితే ఎంప్రెస్ వు సంపద బిలియన్లలో కాదు ట్రిలియన్లలో ఉంది. ఇది దాదాపు 16 ట్రిలియన్ డాలర్లు ఉంటుందని అంచనా.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..