- Telugu News Photo Gallery Meet the worlds most transparent frog glass frog interesting facts Telugu News
వామ్మో ఇదేం మ్యాజిక్ కప్పరా సామీ..! అందమైన రంగులో అద్దంలా కనిపిస్తుంది.. అదేంటో మీరే చూడండి..
భూమిపై ఎన్నో ప్రత్యేకమైన జీవులు కనిపిస్తాయి. అటువంటి వాటిల్లో ఒక కప్ప గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. దాని శరీరాన్ని గమనిస్తే ఆ జీవి ఖచ్చితంగా ప్రకృతి చేసిన అద్భుత సృష్టి అని అంటారు.. ఈ కప్పను 'గ్లాస్ ఫ్రాగ్' అని కూడా అంటారు. చాలా సున్నితంగా కనిపించే ఈ కప్పను జంగిల్ వరల్డ్‌కి 'బెస్ట్ ఫాదర్' అని కూడా పిలుస్తారు. ఎందుకంటే, అది తన గుడ్లను కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని కూడా పణంగా పెడుతుందట..
Updated on: Aug 02, 2023 | 2:02 PM

చాలా సున్నితంగా కనిపించే ఈ కప్పను జంగిల్ వరల్డ్‌కి 'బెస్ట్ ఫాదర్' అని కూడా పిలుస్తారు. ఎందుకంటే, అది తన గుడ్లను కాపాడుకోవడానికి తన ప్రాణాన్ని కూడా పణంగా పెడుతుంది.

నేషనల్ జియోగ్రాఫిక్ నివేదిక ప్రకారం, 156 రకాల గాజు కప్పలు ఉన్నాయి. వీటిని మీరు దక్షిణ మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికాలో చూడవచ్చు. అవి ఉష్ణమండల వర్షారణ్యాలలో ఎక్కువగా నివసిస్తాయి. ఇందులోని అతి చిన్న జాతులు.. సాధారణంగా 0.78 అంగుళాల పొడవు ఉంటాయి. పెద్ద జాతులు 3 అంగుళాల పొడవు వరకు ఉంటాయి.

ఈ కప్పల శరీరం ఆకుపచ్చగా ఉంటుంది. అదే సమయంలో, కొన్ని కప్పల శరీరంపై నలుపు, తెలుపు, నీలం లేదా ఆకుపచ్చ మచ్చలు కూడా ఉంటాయి. ఈ కప్ప శరీరం చాలా పారదర్శకంగా ఉంటుంది. గాజు గ్లాస్ మాదిరిగా దిగువ నుండి చూస్తే, దాని గుండె, కాలేయం, పొట్టలోని ప్రేగులను మీరు స్పష్టంగా చూడవచ్చు.

ఎలాంటి ప్రమాదం ఎదురైన పసిగట్టే ఈ కప్ప తన శరీరాన్ని గాజులాగా పారదర్శకంగా మార్చుకుంటుందని, ఇది వేటాడే జంతువుల నుండి తప్పించుకోవడానికి సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇతర జీవులు వాటిపై దాడి చేసే క్రమంలో.. తేలికగా తప్పించుకోవటానికి, పూర్తి పారదర్శకంగా మారిపోయి ఆకుల్లో దాక్కుంటాయి ఈ కప్పలు.

సైన్స్ జర్నల్‌లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం, గాజు కప్ప రక్తం నుండి 90 శాతం ఎర్ర రక్త కణాలను తొలగిస్తుంది. దాని శరీరం పారదర్శకంగా చేయడానికి కాలేయంలో దానిని ప్యాక్ చేస్తుంది.





























