Axolotl Fish: శరీర భాగాలను రీ జనరేట్ చేసుకునే ఏకైక జీవి ఇదే!!
ఈ భూమిపై కొన్ని వేల మిలియన్ల జాతుల జంతువులు నివసిస్తున్నాయి. వాటి ప్రత్యేకతలు కూడా భిన్నంగా ఉంటాయి. కొన్ని జీవులు ప్రశాంత స్వభావాన్ని కలిగి ఉంటే.. కొన్ని మాత్రం క్రూరమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. క్రూరమైన స్వభావాన్ని కలిగి ఉన్న జంతువులు మానవులను లేదా ఇతర జంతువులను చూసిన వెంటనే దాడి చేస్తాయి. అదే సమయంలో.. కొన్ని జీవులు కూడా చాలా వింతగా ఉంటాయి. వాటిలో ఉండే ప్రత్యేకత గురించి తెలిస్తే.. ఆశ్చర్యపోతుంటారు. అదే జీవి మెక్సికన్ సాలమండర్ గా పిలువబడే..
ఈ భూమిపై కొన్ని వేల మిలియన్ల జాతుల జంతువులు నివసిస్తున్నాయి. వాటి ప్రత్యేకతలు కూడా భిన్నంగా ఉంటాయి. కొన్ని జీవులు ప్రశాంత స్వభావాన్ని కలిగి ఉంటే.. కొన్ని మాత్రం క్రూరమైన స్వభావాన్ని కలిగి ఉంటాయి. క్రూరమైన స్వభావాన్ని కలిగి ఉన్న జంతువులు మానవులను లేదా ఇతర జంతువులను చూసిన వెంటనే దాడి చేస్తాయి. అదే సమయంలో.. కొన్ని జీవులు కూడా చాలా వింతగా ఉంటాయి. వాటిలో ఉండే ప్రత్యేకత గురించి తెలిస్తే.. ఆశ్చర్యపోతుంటారు. అదే జీవి మెక్సికన్ సాలమండర్ గా పిలువబడే ఆక్సోలోల్ ఫిష్. ఈ జీవి తన శరీర భాగాలను పునరుత్పత్తి చేయగల అద్భుతమైన శక్తిని కలిగి ఉంది. ఇది నమ్మశక్యం కాని విషయమే అయినా.. నమ్మి తీరాలి.
సాధారణంగా మానవ శరీరంలోని భాగాలు కత్తిరించబడితే అవి మళ్లీ పెరగవు. గుండెలో సమస్య ఉంటే, దానికి ఆపరేషన్ చేసి భర్తీ చేయవచ్చు. కానీ మెదడు లేదా వెన్నెముక ఎముకలలో సమస్య ఉంటే వాటిని మార్చలేము. కానీ మెక్సికన్ సాలమండర్, ఆక్సోలోల్ గా పిలువబడే ఈ ఫిష్ తన శరీర భాగాలను పునరుత్పత్తిని చేసే అద్భుతమైన శక్తిని కలిగి ఉంది. దాని చేతులు, కాళ్ళను ఉపయోగించడమే కాకుండా గుండె, మెదడు, వెన్నెముక ఎముకలను రీ జనరేట్ చేసుకుంటుంది. ఈ జీవి యొక్క మెదడును తొలగించినా ఆ ఫిష్ కి ఎలాంటి సమస్య ఉంది.
దానికి అదే పునరుత్పత్తి చేసుకుంటుంది
మునుపటి శాస్త్రవేత్తలకు ఆక్సోలోల్ ఫిష్ యొక్క లక్షణాల గురించి అస్సలు తెలియదు. కానీ 1964 సంవత్సరంలో ఈ జీవి తన అవయవాలను తిరిగి పెంచుతుందని తెలుసుకున్నప్పుడు, వారు కూడా ఆశ్చర్యపోయారు. అయితే దాని అవయవాలను పూర్తిగా అభివృద్ధి చేయడానికి కొన్ని వారాల సమయం పడుతుంది. పరిశోధన సమయంలో.. శాస్త్రవేత్తలు ఆక్సోలోల్ ఫిష్ మెదడును అభివృద్ధి చేయడానికి 12 వారాలు పట్టిందని కనుగొన్నారు.
అంతరించిపోయే దశలో మెక్సికన్ సాలమండర్
మెక్సికోలోని సరస్సులలో సాధారణంగా కనిపించే ఈ జీవి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఇది నీటిలో, భూమిపై సౌకర్యవంతంగా జీవించగలదు. అయితే ఈ జీవి ఇప్పుడు అంతరించిపోయే దశలో ఉంది. దీనికి కారణం కాలుష్యం, వాటిపై ఇతర జీవుల దాడేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మెక్సికో ప్రాంతంలో అక్కడక్కగా కనిపించే ఈ జీవులను రక్షించేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు.