Hyderabad: ఫోన్ ఎక్కువగా వాడుతుందని మందలించిన తల్లిదండ్రులు.. కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకిన బాలిక

Hyderabad: తమ కూతురు వాడుతున్న మొబైల్ నంబర్ ను పోలీసులకు ఇచ్చారు బాలిక తల్లిదండ్రులు..వెంటనే నెంబర్ ట్రేసింగ్ లో పెట్టారు పోలీసులు..బాలిక ఫోన్ దుర్గం చెరువు దగ్గరకి రాగానే ఆఫ్ కావడంతో వెంటనే దుర్గం చెరువు లేక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు kphb పోలీసులు..కేబుల్ bridge పై న ఉన్న సీసీ కెమెరాల ద్వారా బాలిక దుర్గంచెరువు లో దూకినట్టు గుర్తించారు..

Hyderabad: ఫోన్ ఎక్కువగా వాడుతుందని మందలించిన తల్లిదండ్రులు..  కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకిన బాలిక
Durgam Cheruvu Cable Bridge
Follow us
Lakshmi Praneetha Perugu

| Edited By: Jyothi Gadda

Updated on: Aug 02, 2023 | 1:33 PM

Hyderabad Cable Bridge: ఫోన్ ఎక్కువగా వాడద్ధు అని తల్లి మందలించింది… మనస్తాపంతో మాదాపూర్ దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై నుండి దూకి ఆత్మహత్య ప్రయత్నం చేసింది ఓ..బాలిక… మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది…వెంటనే సమాచారం అందుకున్న లేక్ పోలీసులు క్షణాల్లో బాలిక ను కాపాడారు.మెరుగైన చికిత్స కోసం బాలిక ను స్థానికంగా ఉన్న ఓ ఆసుపత్రికి తరలించారు..ప్రస్తుతం బాలిక ఆరోగ్యం నిలకడగా ఉంది.KPHB పోలీస్ స్టేషన్ పరిధిలో నివసించే బాలిక, ప్రస్తుతం ఇంటర్మీడియట్ 2వ సంవత్సరం Bi.P.C చదువుతోంది. బాలిక తన మొబైల్ ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుండడం మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో చాటింగ్ చేయడం గమనించిన తల్లిదండ్రులు మందలించడం తో ఆత్మహత్యయత్నం చేసుకుంది.

బాలిక ను కాపాడిన సెల్ ఫోన్ సిగ్నల్..

అంతకు ముందు తమ కూతురు కనిపించడం లేదని తలిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశారు.అయితే ఇక్కడ బాలిక తనతో పాటు తీసుకెళ్లిన మొబైల్ ఫోన్ ఏ తనని రక్షించింది…తమ కూతురు వాడుతున్న మొబైల్ నంబర్ ను పోలీసులకు ఇచ్చారు బాలిక తల్లిదండ్రులు..వెంటనే నెంబర్ ట్రేసింగ్ లో పెట్టారు పోలీసులు..బాలిక ఫోన్ దుర్గం చెరువు దగ్గరకి రాగానే ఆఫ్ కావడంతో వెంటనే దుర్గం చెరువు లేక్ పోలీసులకు సమాచారం ఇచ్చారు kphb పోలీసులు..కేబుల్ bridge పై న ఉన్న సీసీ కెమెరాల ద్వారా బాలిక దుర్గంచెరువు లో దూకినట్టు గుర్తించారు.. వెంటనే లేక్ పోలీసులు స్పందించడం తో బాలిక ప్రాణాలు కాపాడగలిగారు…

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..