AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Global Temperature: మండుతున్న భూమి..అంటార్కిటికా సహా అనేక ప్రాంతాల్లో దారుణమైన వేడి.. 1 లక్షా 20 వేల ఏళ్లలో రికార్డ్..

యూరోపియన్ యూనియన్ డేటా విశ్లేషణ ప్రకారం జూలై 2023 నెలలో జూలై 2019 కంటే కనీసం 0.2°C వెచ్చగా ఉంటుంది. యూరోపియన్ యూనియన్ డేటా ప్రకారం ఈ ఉష్ణోగ్రత 174 సంవత్సరాల రికార్డును బీట్ చేసినట్లు పేర్కొన్నారు. గ్రీక్ , అమెరికాతో పాటు చైనా, ఫ్రాన్స్ , స్పెయిన్ , జర్మనీ, పోలాండ్ దేశాలను కూడా తీవ్రమైన వేడిగాలుల పట్టిపీడిస్తున్నాయి.

Global Temperature: మండుతున్న భూమి..అంటార్కిటికా సహా అనేక ప్రాంతాల్లో దారుణమైన వేడి.. 1 లక్షా 20 వేల ఏళ్లలో రికార్డ్..
Global Temperature
Surya Kala
|

Updated on: Jul 28, 2023 | 8:55 AM

Share

ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకే గ్లోబల్ వార్మ్ పెరుగుతోంది. చాలా వరకు సాధారణ ఉష్ణోగ్రతలు లేదా చల్లగా ఉండే గ్రీస్, అమెరికాలో ప్రజలు గత వారాలుగా తీవ్రమైన వేడిని ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జర్మనీలోని లీప్‌జిగ్ విశ్వవిద్యాలయం ఇటీవల ఒక నివేదికను ప్రచురించింది.. దీనిలో జూలై 2023 నెలలోని  ఉష్ణోగ్రత రికార్డులను బద్దలు కొట్టినట్లు పేర్కొంది. విశ్లేషణ ప్రకారం ఈ నెలలో సగటు ప్రపంచ ఉష్ణోగ్రత మునుపటి సగటు కంటే 1.5 డిగ్రీల సెల్సియస్ ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు.

శాస్త్రవేత్తలు ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు కానున్నాయని అంచనా వేస్తున్నారు. అడవి మంటల కారణంగా ఈ వారం వేలాది మంది పర్యాటకులు గ్రీకు ద్వీపం రోడ్స్ నుండి పారిపోయారు. అదే సమయంలో అమెరికాలోని నైరుతి ప్రజలు కూడా తీవ్రమైన వేడిని ఎదుర్కొన్నారు. యూరోపియన్ యూనియన్ డేటా విశ్లేషణ ప్రకారం జూలై 2023 నెలలో జూలై 2019 కంటే కనీసం 0.2°C వెచ్చగా ఉంటుంది. యూరోపియన్ యూనియన్ డేటా ప్రకారం ఈ ఉష్ణోగ్రత 174 సంవత్సరాల రికార్డును బీట్ చేసినట్లు పేర్కొన్నారు. గ్రీక్ , అమెరికాతో పాటు చైనా, ఫ్రాన్స్ , స్పెయిన్ , జర్మనీ, పోలాండ్ దేశాలను కూడా తీవ్రమైన వేడిగాలుల పట్టిపీడిస్తున్నాయి.

శాస్త్రవేత్తలు ధృవీకరిస్తున్నారు

ఇవి కూడా చదవండి

లీప్‌జిగ్ వాతావరణ శాస్త్రవేత్త కార్‌స్టెన్ హోస్టెయిన్ మాట్లాడుతూ 2019 జూలై నెలలో, ఈ రోజులో ఉన్న పరిస్థితులను చూస్తుంటే గత రెండు నెలల మధ్య ఉష్ణోగ్రతలో ఇంత భారీ వ్యత్యాసం ఉందని దీని ఆధారంగా  చెప్పవచ్చని పేర్కొన్నారు. 2023 జూలై లో అత్యంత వేడి నమోదైంది. యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాకు చెందిన వాతావరణ శాస్త్రవేత్త మైఖేల్ మాన్ కూడా రానున్న రోజుల్లో రికార్డు స్థాయిలో వేడి ఉండనున్నదని  స్పష్టం చేశారు. మనం శిలాజ ఇంధనాలను మండిస్తున్నంత కాలం భూమి ఉష్ణోగ్రత పెరుగుతూనే ఉంటుందని ఆయన అన్నారు.

అంటార్కిటికాలో పెరుగుతున్న వేడి

దక్షిణ అర్ధగోళ శీతాకాలంతో సహ ప్రపంచ సగటు ఉష్ణోగ్రత సాధారణంగా 16 °C ఉంటుంది. అయితే ఈ జూలైలో ఉష్ణోగ్రత దాదాపు 17 డిగ్రీల సెల్సియస్‌కు పెరిగింది. విపరీతమైన వేడి కారణంగా ప్రపంచంలోని అనేక ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. రాత్రులు సాధారణంగా చల్లగా ఉండే ఎడారి ప్రాంతాల్లో, US రాష్ట్రంలోని కాలిఫోర్నియాలోని డెత్ వ్యాలీ ఈ నెలలో రాత్రిలో అత్యంత ఉష్ణోగ్రతను నమోదు చేసింది. భూమి పై అత్యంత శీతల ప్రదేశం అంటార్కిటికాలో కూడా అత్యంత వేడిని నమోదు చేసింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
ఆర్సీబీపై గెలిచినా 3లోనే SRH.. తొలి క్వాలిఫైయర్‌ ఆడేది ఎవరంటే?
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
SRH vs RCB Result : పగ తీర్చుకున్న హైదరాబాద్.. ఆర్సీబీపై ఘన విజయం
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
కాటేరమ్మ కొడుకు బీభత్సం.. కట్‌చేస్తే.. బద్దలైన పంత్ రికార్డ్‌.
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
SRH vs RCB మ్యాచ్‌లో బద్దలైన రికార్డుల లిస్ట్ చూస్తే వణుకే..!
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
బరువు తగ్గాలా..? అయితే మీ ఫ్రిజ్‌లో ఈ 4 వస్తువులు కచ్చితంగా..
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కోహ్లీ ఖాతాలో సరికొత్త ప్రపంచ రికార్డు.. అదేంటంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
కష్టాల్లో ఆర్సీబీ.. ప్రతీ ఓవర్‌కు ఎన్ని పరుగులు రావాలంటే?
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
‘సన్‌రైజర్స్’ దెబ్బకు హెజల్‌వుడ్‌ కెరీర్‌లోనే చెత్త రికార్డ్
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
మెచ్యురిటీకి ముందే FD డబ్బు తీసుకుంటే.. పెనాల్టీ కట్టాలా?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?
ప్రమాదంలో పైసా.. ఎకానమీ ఎగాదిగా.. మహా సంక్షోభం తప్పదా..?