నేల, నీరు, బురద, రాళ్లపై దూసుకెళ్లే సరికొత్త వెహికిల్.. చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే
ఫిన్లాండ్‌లోని ఓ కంపెనీ సరికొత్త వెయికిల్‌ను తయారుచేసి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. నేలపైన, నీటిలో, బురదలో, రాళ్లలోను దూసుకెళ్లే ఈ సరికొత్త ఆల్ టెరైన్ వెహికిల్ (ఏటీవీ) వెహికిల్‌ను అభివృద్ధి చేసి ఔరా అనిపిస్తోంది. దాదాపు 18 చక్రాలు ఉండే ఈ వెహికిల్‌కు ఫ్లయింగ్ ఐబ్రో అని పేరుపెట్టారు.
ఫిన్లాండ్‌లోని ఓ కంపెనీ సరికొత్త వెయికిల్‌ను తయారుచేసి అందరిని ఆశ్చర్యపరుస్తోంది. నేలపైన, నీటిలో, బురదలో, రాళ్లలోను దూసుకెళ్లే ఈ సరికొత్త ఆల్ టెరైన్ వెహికిల్ (ఏటీవీ) వెహికిల్‌ను అభివృద్ధి చేసి ఔరా అనిపిస్తోంది. దాదాపు 18 చక్రాలు ఉండే ఈ వెహికిల్‌కు ఫ్లయింగ్ ఐబ్రో అని పేరుపెట్టారు. అయితే ఇది అన్నిరకాల ప్రదేశాల్లో అమాంతగా దూసుకెళ్లగలదని ఆ కంపెనీ వెల్లడించింది. అయితే గత ఏడాదే ఈ వెహికిల్ ప్రొటోటైప్‌ను విడుదల చేసినప్పటికీ.. అక్బోబర్‌లో దీని లేటెస్ట్ వెర్షన్‌ను విడుదల చేయనున్నారు. ఈ వెహికిల్ బ్యాటరీతో నడుస్తూ పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది.
దీనికి ఉండే 18 చక్రాల్లో ప్రతిదాంట్లోను విడివిడిగా ఎలక్ట్రిక్ మోటర్లు బిగించారు. 45 సెం.మీ ఎత్తు ఉండే రాళ్లపైనా, పడిపోయిన చెట్లపైనా కూడా ఈ వెహికిల్ ప్రయాణించగలదని ఆ కంపెనీ పేర్కొంది. అలాగే మెట్లపైనా కూడా ఇది దూసుకుపోతుందని.. ఇలాంటి వాహనానికి భూమిపై మరే వాహనం పోటీ లేదని చెప్పింది. నెలపై ఇది తక్కువ ఒత్తిడినే కలగజేస్తుందని.. అందువల్ల మట్టి, గడ్డి, పచ్చికకుగానీ ఎలాంటి నష్టం జరగదని వెల్లడించింది.