AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: విద్యార్ధుల హాజరు శాతానికి కూడా మార్కులు.. విద్యాశాఖకు ఐఎస్‌బీ సిఫార్సులు

వలం పాఠాలు చెప్పడం, రాత పరీక్షలు జరిపి విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడం మాత్రమేకాకుండా హాజరుకూ మార్కులు కేటాయించాలని రాష్ట్ర విద్యాశాఖకు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ISB) చేసిన సిఫార్సు చేసింది. విద్యార్ధులను..

Telangana: విద్యార్ధుల హాజరు శాతానికి కూడా మార్కులు.. విద్యాశాఖకు ఐఎస్‌బీ సిఫార్సులు
Marks For Students Attendance
Srilakshmi C
|

Updated on: Jul 27, 2023 | 1:46 PM

Share

హైదరాబాద్‌, జులై 27: కేవలం పాఠాలు చెప్పడం, రాత పరీక్షలు జరిపి విద్యార్థుల ప్రతిభను అంచనా వేయడం మాత్రమేకాకుండా హాజరుకూ మార్కులు కేటాయించాలని రాష్ట్ర విద్యాశాఖకు ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ISB) చేసిన సిఫార్సు చేసింది. విద్యార్ధులను 360 డిగ్రీల్లో పరీక్షించేలా కార్యచరణ రూపొందించాలని తన సిఫార్యుల్లో పేర్కొంది. నైపుణ్యాలు అలవడేందుకు ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు, చర్చలు, క్విజ్‌లు లాంటి వాటికి పెద్దపీట వేయాలి తెల్పింది.

విద్యార్థులకు ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ఉన్నత విద్యామండలి 8 నెలల క్రితం ఐఎస్‌బీతో ఒప్పందం కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విశ్వవిద్యాలయాల వీసీలు, డిగ్రీ అధ్యాపకులు, విద్యార్థులతో చర్చలు జరిపిన అనంతరం ఇటీవలే ఆయా సిఫార్సులతో కూడిన నివేదికను ఉన్నత విద్యామండలికి ఐఎస్‌బీ అందజేసింది. ఉన్నత విద్యామండలి అధికారులు దాన్ని ప్రభుత్వానికి సమర్పించారు. దీనిపై త్వరలో విద్యాశాఖ మంత్రితో చర్చించి అమలుపై నిర్ణయం తీసుకోనున్నారని తెలిసింది. ఈ అధ్యయనంలో భాగంగా ఐఎస్‌బీ బృందం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి 258 మంది కాలేజీల అధ్యాపకులు, 692 మంది విద్యార్థుల అభిప్రాయాలను సర్వే రూపంలో సేకరించి ఈ సిఫార్సులు చేసింది.

ఇవి కూడా చదవండి

కొన్ని ముఖ్యమైన సిఫార్సులు..

  • క్రమం తప్పకుండా తరగతులకు హాజరయ్యేవారికి, తరగతి గదిలో క్రియాశీలకంగా చర్చల్లో పాల్గొనే వారికి ప్రత్యేకంగా మార్కులు కేటాయించాలి.
  • పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య అనుసంధానం మరింత పెంచాలి. ఇంటర్న్‌షిష్‌లు, ప్రాంగణ నియామకాల కల్పనకు ఒక ప్రత్యేక వెబ్‌పోర్టల్‌ను ఏర్పాటు చేయాలి.
  • విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు ఫీల్డ్‌ వర్క్‌లు, ప్రాజెక్టు అధ్యయనాలు, ఇంటర్న్‌షిప్‌లు, క్విజ్‌లు, ఆన్‌లైన్‌ సిమ్యులేషన్లు తదితర వాటిని ప్రవేశపెట్టాలి.
  • ప్రతి యూనివర్సిటీలో ‘సెంటర్‌ ఫర్‌ ఇన్నోవేషన్‌ ఇన్‌ ఎవాల్యుయేషన్‌ అండ్‌ అసెస్‌మెంట్‌’ పేరిట కేంద్రాలను ఏర్పాటు చేసి అక్కడ మూల్యాంకనం, పరీక్షల నిర్వహణలో కొత్త విధానాలను అమలు చేసేందుకు పరిశోధన జరపాలి.
  • డిగ్రీ స్థాయిలో రీసెర్చ్‌ మెథడ్‌ తీసుకురావాలి.
  • ఎక్కువ డిమాండ్‌ ఉన్న కృత్రిమ మేధ, మెషిన్‌ లెర్నింగ్‌, డేటా సైన్స్‌, క్లౌడ్‌ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, రోబోటిక్స్‌ తదితర కోర్సులను అన్ని యూనివర్సిటీల్లో ప్రవేశపెట్టాలి
  • వారానికి 34 గంటలకు మించకుండా సాఫ్ట్‌ స్కిల్స్‌ ముఖ్యంగా గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందించాలి. అంతర్గత పరీక్షల మార్కులను 30 లేదా 40కి పెంచాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.