అవిశ్వాస తీర్మాణంలో ప్రభుత్వంపై వారు చేసిన ఆరోపణలకు ప్రధానమంత్రి కానీ, మంత్రి మండలి సభ్యులు కానీ సమాధానం చెప్పవలసి ఉంటుంది. ఈ చర్చ ముగిసిన అనంతరం అవిశ్వాస తీర్మానంపై స్పీకర్ ఓటింగ్ నిర్వహిస్తారు. అందులో మెజారిటీ సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేస్తే ప్రభుత్వం పడిపోతుంది. మెజారిటీ సభ్యులు తీర్మానాన్ని వ్యతిరేకిస్తే తీర్మానం వీగిపోతుంది. స్వాతంత్య్రానంతర భారత దేశ పార్లమెంటు చరిత్రలో ఇది 28వ అవిశ్వాస తీర్మానం.