శ్మశానంలో ప్రేమ పెళ్లి.. ముక్కున వేలేసుకున్న ఊరి జనాలు!

ఓ తండ్రి శ్మశానంలో కూతురికి ఘనంగా ప్రేమ పెళ్లి జరిపించాడు. సంప్రదాయబద్ధంగా వీరికి వివాహం జరిపించి ఆశీర్వదించాడు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది..

శ్మశానంలో ప్రేమ పెళ్లి.. ముక్కున వేలేసుకున్న ఊరి జనాలు!
Marriage
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 27, 2023 | 7:13 AM

ముంబాయ్‌, జులై 27: ఓ తండ్రి శ్మశానంలో కూతురికి ఘనంగా ప్రేమ పెళ్లి జరిపించాడు. సంప్రదాయబద్ధంగా వీరికి వివాహం జరిపించి ఆశీర్వదించాడు. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లాలో ఈ విచిత్ర ఘటన చోటు చేసుకుంది.

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా శిర్డీ సమీపంలోని రహతా గ్రామానికి చెందిన జోగి గంగాధర్‌ గైక్వాడ్‌, గంగూబాయ్‌ గైక్వాడ్‌ దంపతులకు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. గంగాధర్‌ స్థానిక శ్మశానవాటికలో కాటికాపరిగా పనిచేస్తు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మహాసంజోగి వర్గానికి చెందిన గంగాధర్ చాలా ఏళ్లుగా కుటుంబంతో కలిసి శ్మశానంలోనే నివాసం ఉంటున్నాడు. వీరి చిన్న కుమార్తె మయూరి షిర్డీకి చెందిన మనోజ్‌ జైస్వాల్‌ను గత కొంతకాలంగా ప్రేమిస్తోంది. వీరిద్దరి కులాలు వేరువేరు అయినా పెద్దలు వీరి పెళ్లికి అంగీకారం తెలిపారు.

Marriage At Crematorium

Marriage At Crematorium

దీంతో మయూరి పెరిగిన చోటే ఆమె పెళ్లి చేయాలని గంగాధర్‌ భావించాడు. ఆ మేరకు బంధుమిత్రులందరి సమక్షంలో అంగరంగ వైభవంగా ఈ జంట పెళ్లి తంతు ముగించారు. విభిన్నమైన వీరి పెళ్లి వేడుక స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో
స్వీట్‌ పొటాటో తింటే.. మీ గుండె ఆరోగ్యానికి ఢోకా ఉండదు.. మరెన్నో