Richest Criminal: ఐదో తరగతి డ్రాఫ్‌ఔట్ క్రైం రికార్డు.. 25 ఏళ్లలో 14 రాష్ట్రాల్లో 1200 దొంగతనాలు! కోట్లలో కూడబెట్టిన ఆస్తులు..
అతను ఐదో తరగతి డ్రాపవుట్. అయితే నేం.. పాతికేళ్లుగా కోల్‌కతా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ఏకంగా14 రాష్ట్రాల్లో 1200 దొంగతనాలు చేసి కోట్ల సొమ్ము వెనకేసుకున్నాడు. పోలీసులు తెలిపిన
కోల్ కతా, జులై 26: అతను ఐదో తరగతి డ్రాపవుట్. అయితే నేం.. పాతికేళ్లుగా కోల్‌కతా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ఏకంగా14 రాష్ట్రాల్లో 1200 దొంగతనాలు చేసి కోట్ల సొమ్ము వెనకేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
రెండేళ్ల క్రితం సాల్ట్ లేక్‌లోని సౌరన్ అబాసన్‌లో జరిగిన చోరీ కేసులో నదీమ్ ఖురేషీ (45) అనే వ్యక్తి రాజస్థాన్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వస్త్రధారణ చూసిన పోలీసులే అవాక్కయ్యారు. టిప్‌టాప్ స్టైల్లో కార్పొరేట్ ఫార్మల్స్‌లో సూటు ధరించి ఎన్నారైలా ఉన్నాడు. 2021లో రూ.12 లక్షల చోరీ నేరంతో సహా పలు నేరాల్లో అతను దోషిగా ఉన్న నదీమ్‌ను పోలీసులు అరెస్టుచేశారు. కోర్టు అతనికి ఏడు రోజుల రిమాండ్ విధించింది. దీంతో ఘజియాబాద్ పోలీసులు తీహార్ జైలు నుంచి బెంగాల్‌కు తరలించారు. దర్యాప్తులో పలు కీలక విషయాలు బయటికొచ్చాయి.
నదీమ్ క్రైం స్టోరీ..
ఐదో తరగతి డ్రాపౌట్ అయిన నదీమ్ తన స్వస్థలమైన ఘజియాబాద్‌లో పశువుల చోరీతో తన నేరప్రస్థానం మొదలుపెట్టాడు. 17 ఏళ్ల వయసు నుంచి నేరబాటపట్టాడు. ఇలా దాదాపు 25 ఏళ్లలో ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ , ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా సహా మొత్తం 14 రాష్ట్రాల్లో నేరాలకు పాల్పడ్డాడు. అతనికి ముంబై, పూణెలలో కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. అతని పిల్లలు ఇంటర్నేషనల్ కార్పొరేట్ స్కూల్‌లో చదువుతున్నారు. 25 ఏండ్లుగా దొంగతనాలు, దోపిడీలే అతని వృత్తి.
నదీమ్ ఖురేషీ దొంగతనం చేసే విధానం ఇదీ..
ఆఫీసర్‌లా తయారయ్యి ఖరీదైన కార్లలో ప్రయాణించి బిల్డింగుల వద్ద దిగి రెక్కీ నిర్వహించేవాడు. తాళం వేసి ఉన్న, తక్కువ కాపలా ఉన్న గృహాలు లక్ష్యంగా దోపిడీలకు పాల్పడేవాడు. నగలు, నగదుతోపరారయ్యేవాడు. నదీమ్ 8సార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. అతనిపై 23 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. యువకులకు దొంగతనాలు చేయడంలో శిక్షణ ఇచ్చి ‘నదీమ్ గ్యాంగ్’ను సైతం ఏర్పాటు చేసుకున్నాడు. ఇన్నాళ్లు ముప్పు తిప్పలు పెట్టిన దొంగ నదీమ్ ఖురేషీ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.