- Telugu News Photo Gallery Cinema photos Tollywood: Star hero Megastar Chiranjeevi did not undergo leg surgery in America; here's full clarification
Chiranjeevi: మెగాస్టార్ చిరు అమెరికా వెళ్లింది అందుకా..? క్లారిటీ ఇచ్చిన సన్నిహితులు..
మెగాస్టార్ చిరంజీవి కొత్త మువీ 'భోళా శంకర్' షూటింగ్ పనులు తాజాగా పూర్తయ్యాయి. జూలై 27న ఈ మువీ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది..
Updated on: Jul 26, 2023 | 12:09 PM

మెగాస్టార్ చిరంజీవి కొత్త మువీ 'భోళా శంకర్' షూటింగ్ పనులు తాజాగా పూర్తయ్యాయి. జూలై 27న ఈ మువీ ట్రైలర్ రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.

'భోళా శంకర్' షూటింగ్ పూర్తి కావడంతో భార్య సురేఖతో కలిసి చిరు అమెరికా ట్రిప్‌కు వెళ్లారు. అది విహారయాత్ర కాదనీ ఓ మైనర్ సర్జరీ కోసం చిరు అమెరికా వెళ్లినట్లు నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

చిరు గత కొన్ని రోజుల నుంచి కాలి నొప్పితో బాధపడుతున్నారని, కాలికి చిన్నపాటి సర్జరీ చేయించుకని తిరిగి వచ్చారనేది ఆ వార్తల సారాంశం. ఈ విషయమై టీవీ9 ప్రతినిధి చిరంజీవి సన్నిహిత వర్గాలను సంప్రదించగా అసలు విషయం వెల్లడించారు.

చిరంజీవికి అమెరికాలో సర్జరీ జరగలేదనీ, క్యాజువల్ చెకప్ మాత్రమే జరిగిందని వెల్లడించారు. అమెరికా నుంచి ఆయన తిరిగొచ్చి 10 రోజులయ్యిందని వారు తెలిపారు. కాబట్టి ఎలాంటి అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు.

కాగా 'భోళా శంకర్' మువీ ఆగస్టు 11న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. త్వరలో ఈ మువీ ప్రమోషన్లకు చిరు హాజరుకానున్నారు. చిరు పెద్ద కూతురు సుస్మితకు చెందిన గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థలో మరో కొత్త సినిమాకి కూడా చిరు నటించనున్నారు. ఇది మలయాళ సినిమా 'బ్రో డాడీ'కి రీమేక్ అని సమాచారం. ఈ మువీలో చిరుచ త్రిష, సిద్ధు, శ్రీలీల నటిస్తారని టాక్.




