Crime: ఐదేళ్ల చిన్నారి చెప్పిన సాక్ష్యం.. నేరస్తుడికి జీవిత ఖైదు!

కళ్ల ముందే కన్న తల్లిని చంపుతుంటే అడ్డుకోలేని వయసు ఆ చిన్నారిది. పసివాడు తనేం చేస్తాడులే అనుకన్నాడా నేరస్తుడు. చివరకు ఆ బాలుడు చెప్పిన సాక్ష్యం అతన్ని కటకటాలపాటు చేసింది. నిందితుడు మరెవరో కాదు సొంత..

Crime: ఐదేళ్ల చిన్నారి చెప్పిన సాక్ష్యం.. నేరస్తుడికి జీవిత ఖైదు!
Mumbai Dentist Umesh
Follow us
Srilakshmi C

|

Updated on: Jul 26, 2023 | 11:18 AM

కోల్ కతా, జులై 26: కళ్ల ముందే కన్న తల్లిని చంపుతుంటే అడ్డుకోలేని వయసు ఆ చిన్నారిది. పసివాడు తనేం చేస్తాడులే అనుకన్నాడా నేరస్తుడు. చివరకు ఆ బాలుడు చెప్పిన సాక్ష్యం అతన్ని కటకటాలపాటు చేసింది. నిందితుడు మరెవరో కాదు సొంత తండ్రే. 2016లో ఐదేళ్ల కుమారుడి ఎదుటే కట్టుకున్న భార్యను అత్యంత కిరాతకంగా చంపాడు డెంటిస్ట్‌ ఉమేష్‌ బోబాలే. కొడుకు చెప్పిన సాక్ష్యం ఆధారంగానే ముంబైలోని సెషన్స్‌ కోర్టు సోమవారం తండ్రి ఉమేష్‌కు జీవితఖైదు విధించింది.

2016 డిసెంబర్‌ 11న దాదర్ ప్రాంతంలో ఈ హత్య జరిగింది. ఐదేళ్ల కుమారుడు కళ్లెదుటే భార్య తనూజను వంట గదిలో కత్తితో కిరాతకంగా గొంతుకోసి చంపాడు ఉమేష్. మృతురాలి శరీరంపై 34 కత్తిగాట్లు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టు వెల్లడించింది. ఈ హత్య జరగడానికి కొన్ని నెలల ముందు ఈ దంపతులు విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడం కొసమెరుపు. విడాకులు ఖరారైతే భార్యకు భరణం చెల్లించాల్సి వస్తుందని, అందుకే హత్యకుపాల్పడినట్లు రుజువైంది.

ఉమేష్‌, తనూజకు 2009లో వివాహం జరిగింది. పెళ్లైన 6 నెలలకే దంపతుల మధ్య గొడవలు మొదలయ్యాయని మృతురాలి సోదరి చెప్పింది. తనూజ గర్భం దాల్చిన సమయంలోనూ ఆమెకు అక్రమసంబంధాలు అంటగట్టి వేధించేవాడని, బిడ్డకు డీఎన్‌ఏ టెస్టు కూడా చేయించాడని సాక్షులు తెలిపారు. 10 మంది సాక్షుల ఆధారాలు, కొడుకు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా నిందితుడు ఉమేష్‌ జీవితకాల ఖైదు విధిస్తూ కోర్టు తాజాగా తీర్పు వెలువరించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
జనవరిలో తెలంగాణ ఈఏపీసెట్‌ 2025 షెడ్యూల్‌ విడుదల.. జేఈఈ తర్వాతే!
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని మోడీ..
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
గ్రామాల్లో 10,911 జేఆర్వో పోస్టుల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
Horoscope Today: వారికి ఆదాయ వృద్ధికి సమయం అనుకూలం..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?