Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ. 40 లక్షలు ఇవ్వాలంటూ యువరాజ్ సింగ్‌ తల్లికి బెదిరింపులు.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే షాకిచ్చిన పోలీసులు..

Yuvraj Singh Mother: క్రికెటర్ యువరాజ్ సింగ్ తల్లి షబానన్ సింగ్‌ను తప్పుడు కేసులో ఇరికిస్తామని బెదిరించి రూ.40 లక్షలు వసూలు చేసేందుకు ప్రయత్నించిన యువతిని ఢిల్లీలోని గురుగ్రామ్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు.

రూ. 40 లక్షలు ఇవ్వాలంటూ యువరాజ్ సింగ్‌ తల్లికి బెదిరింపులు.. కట్‌చేస్తే.. దిమ్మతిరిగే షాకిచ్చిన పోలీసులు..
Yuvraj Singhs Mother
Follow us
Venkata Chari

|

Updated on: Jul 26, 2023 | 3:42 PM

యువరాజ్ సింగ్ తల్లి షబానన్ సింగ్‌ను తప్పుడు కేసులో ఇరికిస్తానని బెదిరించి రూ.40 లక్షలు దోపిడీకి ప్రయత్నించిన యువతిని ఢిల్లీ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. వాస్తవానికి అరెస్టయిన నిందితుడు హేమ కౌశిక్ అలియాస్ డింపీ 2022లో యువరాజ్ సింగ్ తమ్ముడు జోరావర్ సింగ్‌ను చూసుకోవడానికి కేర్‌టేకర్‌గా పనిచేసింది. అయితే ఆమె పనితో సంతృప్తి చెందకపోవడంతో క్రికెటర్ యువరాజ్ సింగ్ తల్లి షబ్నం సింగ్ ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో మనస్తాపానికి గురైన హేమ కౌశిక్ దోపిడీకి సిద్ధమైనట్లు సమాచారం.

యువరాజ్ సింగ్ తమ్ముడు జోరావర్ సింగ్ గత 10 ఏళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నాడు. కాబట్టి, అతని సంరక్షణ కోసం హేమ కౌశిక్ అలియాస్ డింపీని 2022లో కేర్‌టేకర్‌గా నియమించారు. అయితే ఆమె నియామకం జరిగిన 20 రోజుల్లోనే ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. దీంతో కోపోద్రిక్తురాలైన హేమ యువరాజ్ కుటుంబంపై ప్రతీకారం తీర్చుకునేందుకు రూ.40 లక్షలు ఇవ్వకుంటే తప్పుడు కేసు పెడతానని బెదిరించింది.

రూ. 40 లక్షలు డిమాండ్ చేసిన నిందితురాలు..

హేమకౌశిక్ తప్పుడు కేసులో ఇరికిస్తుందేమోనని భయపడిన యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్ సింగ్.. రూ.40 లక్షలు ఇచ్చేందుకు ఒప్పుకుంది. మొదటి విడతగా రూ.5 లక్షలు ఇస్తానని చెప్పుకొచ్చింది. ఇలా మంగళవారం రూ.5 లక్షలు వసూలు చేసేందుకు వచ్చిన హేమ కౌశిక్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

ఇవి కూడా చదవండి

దీనిపై మాట్లాడిన యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్ సింగ్.. నా కొడుకు బాగోగులు చూసేందుకు హేమ కౌశిక్‌ని నియమించాం. కానీ, ఆమె నియామకం జరిగిన 20 రోజులకే, ఆమె వ్యవహారం తేడాగా అనిపించింది. అలాగే ఆమె నా కొడుకుని తన వలలో వేసుకోవడానికి ప్రయత్నిచింది. అందుకే హేమ కౌశిక్‌ని పనిలోంచి తొలగించాను అని చెప్పుకొచ్చింది.

వాట్సాప్‌లో నిత్యం బెదిరింపులు..

DLF ఫేజ్ 1 పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం, మే 2023లో, హేమ కౌశిక్ నిరంతరం వాట్సాప్ సందేశాల ద్వారా షబ్నమ్‌కి కాల్ చేసేది. డబ్బులు ఇవ్వకుంటే మొత్తం కుటుంబాన్ని తప్పుడు కేసులో ఇరికిస్తానని యువరాజ్ తల్లిని హేమ బెదిరించింది. ఆ తర్వాత జులై 19న షబ్నమ్ సింగ్‌కు మెసేజ్ చేసిన హేమ కౌశిక్.. డబ్బులు చెల్లించకపోతే జులై 23న ఎఫ్‌ఐఆర్ పెడతానని బెదిరించింది. దీంతో షాకైన షబ్నం.. డబ్బు కట్టేందుకు సమయం కావాలని హేమను కోరింది.

అనంతరం డీఎల్‌ఎఫ్ ఫేజ్ 1 పోలీస్ స్టేషన్‌లో షబ్నమ్ ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు హేమకు అడ్వాన్స్‌గా రూ.5 లక్షలు ఇవ్వాలని ప్లాన్ చేశారు. అందుకోసం పోలీసుల పథకం ప్రకారం మంగళవారం అడ్వాన్స్ డబ్బులు తీసుకునేందుకు వచ్చిన హేమను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షబ్నమ్ సింగ్ ఫిర్యాదు మేరకు హేమపై ఐపీసీ 384 కింద దోపిడీ కేసు నమోదైంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..