AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: 73 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ప్లేయర్‌ను ఢీ కొట్టనున్న టీమిండియా.. భారీ ప్రమాదంలో రోహిత్ సేన.. ఎందుకంటే?

Gudakesh Motie: వెస్టిండీస్ ప్లేయర్ మోతీ ఎడమచేతి వాటం స్పిన్నర్. 2021 సంవత్సరంలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. భారత్‌తో ఇప్పటి వరకు ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. వెస్టిండీస్ తరపున ఆడిన 4 వన్డేల్లో 8 వికెట్లు పడగొట్టాడు.

IND vs WI: 73 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ప్లేయర్‌ను ఢీ కొట్టనున్న టీమిండియా.. భారీ ప్రమాదంలో రోహిత్ సేన.. ఎందుకంటే?
Gudakesh Motie
Venkata Chari
|

Updated on: Jul 26, 2023 | 12:40 PM

Share

India vs West Indies ODI Series: వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో టీమిండియా ‘మోతీ’ ప్రమాదంలో పడింది. భారత్‌తో జరిగే 3 వన్డేల సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన జట్టులో వెస్టిండీస్ ఆటగాడు మోతీ పేరు చేరింది. మోతీ ఎడమచేతి వాటం స్పిన్నర్. 2021 సంవత్సరంలోనే అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. మోతీ భారత్‌తో కేవలం ఒకే ఒక వన్డే మ్యాచ్ ఆడాడు. తన గడ్డపై ఆడుతూ ఆ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్‌కు సవాల్‌ విసిరాడు. ఇప్పుడు 73 ఏళ్ల రికార్డును కూడా బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. అంటే ఈసారి వారి నుంచి టీమిండియాకు మరింత ముప్పు మరింత ఎదురుకానుంది.

వన్డే సిరీస్‌లో 28 ఏళ్ల గూడకేశ్ మోతీ భారత్‌కు ముప్పుగా మారడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే మొదట ఆ పెద్ద కారణం గురించి తెలుసుకుందాం. ఈ ఏడాది ఫిబ్రవరిలో వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే మధ్య జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఈ కారణం దాగుంది. ఈ మ్యాచ్‌లో తన పదునైన స్పిన్‌తో 73 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టాడు.

73 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన మోతీ..

జింబాబ్వేతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మోతీ 37 పరుగులకు 7 వికెట్లు పడగొట్టాడు. ఈ విధంగా అతను 73 సంవత్సరాల క్రితం అంటే 1950లో ఎల్ఫ్ వాలెంటైన్ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంగ్లండ్‌పై వాలెంటైన్ 39 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి

అయితే, మోతీ ఈ ప్రదర్శన రెడ్ బాల్ క్రికెట్‌లో నమోదైంది. టెస్ట్‌లతోపాటు ప్రతి ఫార్మాట్‌లో అత్యుత్తమంగా ఉంటాడు. మోతీ వెస్టిండీస్‌కు ఓ ట్రంప్ కార్డ్‌గా కూడా మారవచ్చని అంటున్నారు. ఈ ఆటగాడి ప్రమాదం నుంచి భారత జట్టు సురక్షితంగా ఉండాలి.

భారత్‌తో 1 వన్డే.. 2 వికెట్లు..

2022లో భారత్ వెస్టిండీస్‌లో పర్యటించింది. మోతీ పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో భారత్‌తో వన్డే ఆడాడు. ఆ మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మెన్ 10 ఓవర్లలో 54 పరుగులు చేయగలిగారు. అయితే అతను శిఖర్ ధావన్, శ్రేయాస్ అయ్యర్‌ల రెండు భారీ వికెట్లను కూడా తీశాడు.

రోహిత్, విరాట్, పాండ్యాలకు మోతీతో ఆడిన అనుభవం లేదు..

ప్రస్తుత పర్యటనలో భారత జట్టులో ఉన్న చాలా మంది ఆటగాళ్లకు ఇంతకు ముందు ఆడిన అనుభవం లేదు. ఈసారి మోతీ నుంచి ప్రమాదం మరింత ఎక్కువగా ఉండవచ్చని తెలుస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా, ఇషాన్ కిషన్ వంటి పెద్ద పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నాయి.

మోతీకి వ్యతిరేకంగా పరుగులు సాధించడం కష్టమే..

ODI క్రికెట్‌లో గూడకేశ్ మోతీ ఎకానమీ రేటు భారతదేశం పరిస్థితి మరింత దిగజారడానికి ప్రధాన కారణంగా నిలిచింది. వెస్టిండీస్ తరపున ఇప్పటి వరకు ఆడిన 4 వన్డేల్లో 8 వికెట్లు పడగొట్టాడు . కానీ ఈ కాలంలో మోతీ ఎకానమీ రేటు 4 కంటే తక్కువగా ఉంది. అతను కేవలం 3.65 ఎకానమీతో పరుగులు ఇచ్చాడు. అంటే, అతను వికెట్లు తీయకపోయినా, బ్యాట్స్‌మెన్‌ను పరుగులు చేయకుండా ఆపడంలో మాత్రం అత్యంత నిపుణుడు. ఇది టీమ్ ఇండియాకు ప్రాణాంతకం కావొచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పసుపు, ఉసిరి తింటున్నారా? ఈ పొరపాట్లు చేస్తే ఇక అంతే
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
పెట్టుబడి లేకుండా లక్షలు తెచ్చిపెట్టే బిజినెస్‌!
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
Pakistan: ఎప్పుడూ అదే ధ్యాస.. ఛీ, ఛీ.. వారానికోసారి..?
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
టోల్ గేట్ల వద్ద కొత్త విధానం.. సంక్రాంతికి ఇంటికెళ్లే వారికి ఊరట
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
పాదాల్లో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? నరాలు దెబ్బతినే ప్రమాదం!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ఆన్‌లైన్‌లో పర్సనల్‌ లోన్‌ తీసుకుంటున్న వారికి బిగ్‌ అలర్ట్‌..!
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
ముఖంపై నల్ల మచ్చలు! స్టార్ హీరోయిన్ బాధ వర్ణనాతీతం
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
తోపు ఫాంలో ఉన్నా, తొక్కిపడేస్తాం.. వెళ్లి ఐపీఎల్ ఆడుకో
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
సికింద్రాబాద్ నుంచి త్వరలో వందే భారత్ స్లీపర్.. ఈ రూట్లోనే..
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు
వంటగది సామాగ్రి, ఎయిర్‌ కండిషనర్లు కొనే వారికి బిగ్‌ షాక్‌ ! ధరలు