- Telugu News Photo Gallery Cricket photos India Vs West Indies Team India senoir Players Virat Kohli And Rohit Sharma Eye on key Records In ODI Series check full list here
IND vs WI: క్రికెట్ దేవుడి రికార్డులపై కన్నేసిన కింగ్ కోహ్లీ, రోహిత్.. ఎలైట్ లిస్టులో ఎవరున్నారో తెలుసా?
India Vs West Indies: వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో టీమిండియా సీనియర్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కీలక మైలురాళ్లపై కన్నేశారు. ముఖ్యంగా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ లిస్టులో చేరేందుకు సిద్ధమయ్యారు.
Updated on: Jul 26, 2023 | 12:56 PM

వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే సిరీస్‌లో టీమిండియా సీనియర్ బ్యాట్స్‌మెన్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ కీలక మైలురాళ్లపై కన్నేశారు.

ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్ జులై 27న బార్బడోస్‌లో జరగనుంది. ఇందులో విరాట్ కోహ్లీ సెంచరీ లేదా 102 పరుగులు చేస్తే వన్డేల్లో 13000 పరుగులు పూర్తి చేస్తాడు.

దీంతో పాటు అత్యంత వేగంగా 13000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా కింగ్ కోహ్లీ టీమిండియా మాజీ ప్లేయర్ సచిన్ టెండూల్కర్‌ను అధిగమించనున్నాడు. ప్రస్తుతం నెం.1 ర్యాంక్‌లో ఉన్న క్రికెట్ దేవుడు 321 వన్డే మ్యాచ్‌ల్లో 13000 పరుగుల మార్క్‌ను అధిగమించాడు.

ప్రస్తుతం కోహ్లి 50 ఓవర్ల ఫార్మాట్‌లో 274 మ్యాచ్‌లు ఆడి 12898 పరుగులు చేశాడు. లిటిల్ మాస్టర్ రికార్డును బద్దలు కొట్టేందుకు కోహ్లీకి ఇప్పుడు కేవలం 102 పరుగులు కావాలి.

కోహ్లీతో పాటు, కెప్టెన్ రోహిత్ కూడా ODI ఫార్మాట్‌లో ప్రధాన మైలురాయిపై దృష్టి సారించాడు. హిట్‌మ్యాన్‌కి 50 ఓవర్ల ఫార్మాట్‌లో 10,000 పరుగులు పూర్తి చేయడానికి కేవలం 175 పరుగులు మాత్రమే అవసరం.

దీంతో 10,000 పరుగుల క్లబ్‌లో అడుగుపెట్టిన ఆరో భారత ఆటగాడిగా, ఓవరాల్‌గా 15వ ఆటగాడిగా రోహిత్ నిలుస్తాడు.

ఈ విషయంలో సచిన్ టెండూల్కర్ (18,426) మొదటి స్థానంలో ఉండగా, విరాట్ కోహ్లీ (12,809), సౌరవ్ గంగూలీ (11,363), రాహుల్ ద్రావిడ్ (10,889), ఎంఎస్ ధోని (10,773) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.




